అది పిరికిపంద‌ల చ‌ర్య‌

-మాకు కార్మికుల నుంచి వ‌చ్చే మ‌ద్ద‌తు చూసి టీబీజీకేఎస్ ఆందోళ‌న‌
-అందుకే అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు
-మీకు ద‌మ్ముంటే రాష్ట్రం బకాయి ప‌డ్డ రూ. 25 వేల కోట్లు వ‌సూలు చేయండి
-కేసీఆర్ ప్ర‌భుత్వ వ‌ల్లే లాభాల్లో ఉన్న సంస్థ న‌ష్టాల్లోకి
-బీఎంఎస్ జాతీయ కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యుడు మాధవ నాయక్‌

మంచిర్యాల : బీఎంఎస్ త‌ల‌పెట్టిన సింగరేణి కార్మిక చైతన్య యాత్రను అడ్డుకునేందుకు టీబీజీకేఎస్ నేత‌లు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశార‌ని, ఈ సంద‌ర్భంగా బీఎంఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని అది పిరిక‌పంద‌ల చ‌ర్య అని బీఎంఎస్ జాతీయ కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యుడు మాధవనాయక్ ఖండించారు. మందమర్రి ఏరియాలోని KK-5 ఇంక్లైన్ లో బీఎంఎస్ నేత‌ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నంపై నైవెలి నిగ్నైట్ మైన్స్ పర్యటనలో ఉన్న ఆయ‌న స్పందించారు. కార్మికుల‌ను చైత‌న్యం చేసేందుకు జ‌రుగుతున్న యాత్ర‌ను అడ్డుకోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. TBGKS తాటాకు చప్పుళ్లకు బీఎంఎస్ భయపడే ప్ర‌సక్తే లేద‌ని అన్నారు. అంత దమ్ము,ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి సింగరేణికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బకాయిలను వసూలు చేయాల‌ని డిమాండ్ చేశారు.

లాభాల్లో ఉన్న సింగరేణి కంపెనీ టీఆర్ఎస్ ప్రభుత్వం వ‌ల్ల రూ.8 వేల కోట్ల న‌ష్టాల్లో కూరుకుపోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.TBGKSకి కార్మికుల మీద ప్రేమ ఉంటే, సింగరేణి సంస్థ బాగుండాలని చిత్తశుద్ధి ఉంటే ఇతర రాష్ట్రాలలో టెండ‌ర్లు వేసి ద‌క్కించుకున్న విధంగానే ఇక్క‌డ కూడా టెండర్లలో పాల్గొని నాలుగు సింగరేణి బొగ్గు బ్లాకులను కూడా దక్కించుకోవాలని డిమాండ్ చేశ ఆరు. అంతేకాని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుందని గోబెల్ ప్రచారం, ఏడుపుగొట్టు మాటలు మాట్లాడొద్దని సూచించారు. నైనీ బొగ్గు బ్లాకుల్లో రూ.50 వేల కుంభకోణం జరిగిందని ఆరోపణల నేప‌థ్యంలో దానిపై తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే సింగరేణిలో TRS రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఒక కార్మికుల ట్రేడ్ యూనియన్ గా సింగరేణి కార్మికులు సమస్యలపై ఇతర జాతీయ సంఘాలతో కలిసి పోరాడాలని హితవు పలికారు.

TBGKS నీతి నిజాయితీ కలిగిన యూనియన్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. BMS కి కార్మికులతో పెరుగుతున్న మద్దతు చూసి,కార్మికులు ఆదరిస్తున్న తీరుని చూసి ఓర్వలేక కడుపు మండి త‌మ యాత్ర‌ను అడ్డుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. సింగరేణి ఎన్నికల్లో ఓడిపోతే బోర్డు మెడికల్ దందా, పైరవీలు దందా, వసూళ్ల దందా ఎక్కడ ఆగిపోతదో అని భయం పట్టుకొట్టుంద‌ని ఎద్దేవా చేశారు. రౌడీలతో BMS నాయకులపై దాడులు చేయిస్తున్నారని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. సింగరేణి చైతన్య యాత్ర కి భంగం కలిగించే నీచమైన సంస్కృతికి తెర తీస్తున్నారని అన్నారు. TBGKS గుండాయిజానికి, రౌడీయిజానికి BMS నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడరని హెచ్చ‌రించారు. కార్మికుల మ‌ద్ద‌తుతో వారికి తగిన స్థాయిలో బుద్దిచెప్తామని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ఎస్‌సీఎంకేఎస్ ఉపాధ్య‌క్షుడు ప్రభాకర్ రావు, పెన్ష‌న‌ర్స్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ. నరేంద్ర బాబు, కేంద్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు సంగం చందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like