ఆదిపురుష్… ఆరు షోలు..

తెలంగాణ స‌ర్కార్ బంప‌రాఫ‌ర్‌
టిక్కెట్ల ధ‌ర‌లు సైతం పెంచుకునేందుకు అనుమ‌తి
పీవీఆర్‌ ఐనాక్స్‌ లో ఇప్ప‌టికే లక్ష టికెట్లు బుక్‌

Adipurush: ఆదిపురుష్ సినిమాకు తెలంగాణ సర్కార్ బంపరాఫర్ ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకోవ‌డంతో పాటు, రోజుకు 6 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమ‌తి కల్పించింది. ప్రభాస్‌, కృతిసనన్ కీలక పాత్రల్లో నటించిన, దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన ‘ఆదిపురుష్‌’ సినిమా 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అగ్ర హీరోల సినిమాలకు మొదటి వారం టికెట్‌ ధరలను పెంచుకునేందుకు ఆంధ్ర‌, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆదిపురుష్ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనల ప్రకారం.. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో టికెట్‌పై రూ. 50 పెంచుకోవచ్చు. మొదటి మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఇతర లైసెన్సింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభాస్‌ (Prabhas) టైటిల్ రోల్‌లో నటిస్తున్న సినిమా ఆదిపురుష్ (Adipurush). మైథలాజిక‌ల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభం కానున్నాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.50 పెంచుకునే అవకాశం ఇచ్చింది. మొదటి 3 రోజులు టికెట్‌ ధర పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది.సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో ప్రస్తుతం టికెట్‌ ధర రూ.175 ఉండగా అదనంగా రూ.50 చెల్లించాలి. మరోవైపు టికెట్ల అమ్మకం విషయంలో ఆదిపురుష్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. పీవీఆర్‌ ఐనాక్స్‌ లో లక్ష టికెట్లు బుక్కయ్యాయంటే బాక్సాఫీస్‌ వద్ద ఆదిపురుష్‌ క్రేజ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా బాలీవుడ్ భామ కృతిస‌న‌న్ సీతగా నటిస్తోంది. లక్ష్మణుడి పాత్రలో స‌న్నీ సింగ్ నటిస్తోండగా.. సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడి (లంకేశ్‌)గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవ్‌ద‌త్తా న‌గే హ‌నుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. టీసిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సాచెట్‌-ప‌రంప‌ర ఆదిపురుష్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like