నిమిషానికి ఏడు వంద‌ల రౌండ్లు..

-ఇక శత్రుదేశాల గుండెల్లో గుబులే
'త్వరలో భారత సైనికుల చేతుల్లోకి ఏకే 203 రైఫిల్స్

AK-203 Assault Rifles: నిమిషానికి 700 రౌండ్లు కాల్పులు జ‌రుపొచ్చు.. శ‌త్రువు 800 మీట‌ర్ల దూరంలో ఉన్నా గుండెల్లోకి గుండు దూసుకుపోవ‌డ‌మే. ఇదీ త్వ‌ర‌లో భార‌త సైనికుల చేతిల్లోకి రాబోతున్న AK-203 అసాల్ట్ రైఫిల్స్ ప్ర‌త్యేక‌త‌లు.

భారతీయ సైనికులు త్వరలో AK-203 అసాల్ట్ రైఫిల్స్‌ను అందుకోబోతున్నారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 5 వేల AK-203 రైఫిళ్ల మొదటి బ్యాచ్‌ను ఈ ఏడాది మార్చి నాటికి సైన్యానికి అందజేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్ల‌డించారు. మరో 32 నెలల్లో 70 వేల ఏకే 203 రైఫిళ్లను భారత సైన్యానికి అందజేయనున్నారు. వచ్చే 10 ఏళ్లలో 6 లక్షల 1 వేల 427 రైఫిళ్లను తయారు చేయనున్నారు.

ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్
AK-203 రైఫిల్స్ ప్రాజెక్ట్ 2018 సంవత్సరంలో ప్రకటించారు. కానీ ఖర్చు, రాయల్టీ , సాంకేతికత గురించి చర్చలు ముందుకు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో, ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం జరిగింది. ఇప్పుడు ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో రైఫిల్స్ తయారీ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మొదటి బ్యాచ్ 7.62 mm అస్సాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి చేశారు. AK-203 రైఫిల్స్ సైతం త్వరలో భారత సైన్యానికి అందజేయనున్నారు.

AK-203 అసాల్ట్ రైఫిల్ ప్రత్యేకతలు
AK 203 రైఫిల్ AK సిరీస్‌లో అత్యంత ప్రాణాంతకమైన, ఆధునిక రైఫిల్. సాంప్రదాయ AK సిరీస్‌లో ఉన్న అన్ని లక్షణాలను దీనిలో ఉంటాయి. రష్యా దీనిని 2018లో సిద్ధం చేసింది. AK 203 అసాల్ట్ రైఫిల్స్ అన్ని వాతావరణ పరిస్థితులలో తేలికగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఆయుధంతో నిమిషంలో 700 రౌండ్ల కాల్పులు జరపవచ్చు. దీని పరిధి 500 నుండి 800 మీటర్లు. ఎకె 203 రైఫిల్ బరువు 3.8 కిలోలు. అయితే దీని పొడవు 705 మిమీ. AK-203 అసాల్ట్ రైఫిల్ ఒక మ్యాగజైన్‌లో 30 రౌండ్లు కాల్చే సామర్థ్యం ఉంటుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like