ఫ్లాష్.. ఫ్లాష్.. అక్బరుద్దీన్ పై కేసులు కొట్టివేత

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌పై నమోదైన దేశద్రోహం కేసులు రెండింటిని కొట్టివేశారు. నిజామాబాద్, నిర్మల్ లో ని రెండు హేట్ స్పీచ్ లను కొట్టివేస్తూ కోర్టు తీర్పు చేపింది. అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయవద్దని కోర్టు హెచ్చరించింది. కేసు కొట్టి వేసినంత మాత్రాన సంబురాలు చేసుకోవద్దని తెలిపింది.

తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, నిజామాబాద్ పర్యటనల్లో అక్బరుద్దీన్ హిందువులు, హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 40 రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. కాగా.. ఈ కేసు విచారణ సుమారు 9 ఏళ్ల పాటు కొనసాగగా.. హైదరాబాద్ నాంపల్లి కోర్టు నేడు తుది తీర్పును వెల్లడింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం కావడంతో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పకడ్భందీ చర్యలు తీసుకున్నారు. ఒవైసీకి కోర్టు శిక్ష విధిస్తే శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు వద్ద దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా.. పాతబస్తీ, నిర్మల్ పట్టణాల్లోనూ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. దేశంలో రాజకీయ నేతలపై నమోదైన దేశద్రోహం కేసుల్లో వెలువడిన తొలి తీర్పు ఇదే కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like