‘అఖండ’ కు పోలీసుల ధ‌న్య‌వాదాలు..

హైద‌రాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాటిక్ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు నెలకొల్పింది. ప్ర‌స్తుతం ఓటీటీలో విడుదలైన ‘అఖండ’ అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని వర్గాల నుంచి అనూహ్య ప్రశంసలు అందుకున్న ‘అఖండ’కు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు కూడా ఫిదా అయిపోయారు. ‘అఖండ’ను ప్రస్తావిస్తూ వారు చేసిన ట్వీ్ట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘అఖండ’ సినిమాలో హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ ఇద్దరూ కారులో వెళ్లే ఓ సీన్‌‌ ఉంటుంది. ఆ సమయంలో హీరో సీట్ బెల్టు ధరించగా… హీరోయిన్ పెట్టుకోదు. అదే సమయంలో వారికి అడ్డంగా ఓ లారీ రావడంతో హీరో సడెన్ బ్రేక్ వేస్తాడు. దీంతో ప్రగ్యా జైస్వాల్ ముందుకు వాలిపోగా ఆమెకు దెబ్బ తగలకుండా బాలయ్య చేయి అడ్డుపెడతాడు. ఆ సన్నివేశంలో ‘సీటు బెల్టు పెట్టుకోండి.. జీవితం చాలా విలువైనది’ అని బాల‌కృష్ణ‌ హీరోయిన్‌తో చెబుతాడు. ఆ సీన్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన హైదరాబాద్ పోలీసులు. ‘ఎంత దూర ప్రయాణమైనా.. ఎవరి కారైనా.. ఎల్లప్పుడూ సీట్ బెల్టు ధరించండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు మూవీ టీమ్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like