`అఖండ`మైన విజ‌యం

అఖండ వసూళ్ల గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. గురువారం విడుదల అయిన అఖండ సినిమా ఆదివారం వరకు అంటే నాలుగు రోజుల పాటు భారీగా వసూళ్లు నమోద‌య్యాయి. ఆదివారం తర్వాత అఖండ జోరు తగ్గుతుందని అంతా భావించారు. కాని అఖండ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. బాలయ్య బి,సి సెంటర్ ల్లో అఖండమైన వసూళ్లను సోమవారం కూడా రాబట్టాడు. రెండేళ్ల కాలంలో వీక్ డేస్ ఏ ఒక్క సినిమాకు రాని వసూళ్లు ఈ సినిమాకు నమోదు అవుతున్నట్లుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అత్యధిక వసూళ్లు అన్ని ఏరియాల్లో కూడా ఆదివారం వరకు నమోదు అయ్యాయి. సోమవారం కూడా నైజాం ఏపీలో పలు సెంటర్ల వద్ద కూడా భారీ ఎత్తున జనాలు బారులు తీరార‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే పలు ఏరియాల్లో అఖండ బ్రేక్ ఈవెన్ సాధించిందనే వార్తలు వస్తున్నాయి. అన్ని ఏరియాల్లో కూడా అఖండ వసూళ్లు నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. చాలా కాలం తర్వాత ఒక మాస్ మసాలా సినిమా పడటంతో బి,సి సెంటర్ ప్రేక్షకులు సినిమా వదలడం లేదు. ఈ మధ్య కాలంలో క్లాస్ మూవీస్ వస్తున్న నేపథ్యంలో అఖండ సినిమాకు ఆద‌రణ కనిపిస్తోంది. ప్రతి ఒక్క బాలయ్య అభిమానితో పాటు తెలుగు ప్రేక్షకులు అఖండ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా వస్తున్న వసూళ్లను చూసి ఇతర సినిమాల మేకర్స్ కూడా తమ సినిమాల ఫలితాలు ఖచ్చితంగా పాజిటివ్ గా వస్తాయనే నమ్మకంకు వచ్చారు.

అఖండ ముందు వరకు సినిమా లు ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం నీరసంగానే ఉంటాయని మొదటి రెండు మూడు రోజులు తప్ప వీక్ డేస్ లో మాత్రం ఖచ్చితంగా నిరాశ తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి అభిప్రాయం తప్పు అయ్యింది. ఇదే జోరు శుక్రవారం వరకు కొనసాగితే మళ్లీ శని ఆదివారాల్లో అఖండ భారీ వసూళ్లు నమోదు చేసి బాలయ్య కెరీర్ లోనే టాప్ వసూళ్లు సాధించిన సినిమా గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. వీక్ డేస్ లో అఖండ స్ట్రాంగ్ వసూళ్లు నమోదు చేస్తున్న నేపథ్యంలో కేవలం ఇది సాదారణ విజయం కాదంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ద్వి పాత్రాభినయం చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రాబోయే శుక్రవారం కూడా పెద్ద సినిమా లో అఖండ కు పోటీ ఇచ్చి ఢీ కొట్టే సినిమా లు లేవు కనుక అఖండ రెండవ వారంలో కూడా స్ట్రాంగ్ గా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like