అఖిల‌ప‌క్షం నేత‌ల అరెస్టులు

మంచిర్యాల : రామ‌కృష్ణాపూర్‌లో అఖిల‌ప‌క్షం నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్ త‌ర‌లించారు. మోతుకూరు దేవేందర్అనే వ్య‌క్తిపై టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ భ‌ర్త చెప్పుతో దాడి చేసినా, పోలీసులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తూ బుధ‌వారం రామ‌కృష్ణాపూర్ ప‌ట్ట‌ణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో వారిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేష‌న్ త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు అఖిల‌ప‌క్షం నేత‌లు మాట్లాడుతూ రామకృష్ణాపూర్ లోని సూపర్ బజార్లో రెగ్జిన్ వర్క్ చేసుకుని జీవనం సాగించే మోతుకూరు దేవేందర్ అతని కుటుంబంపై స్థానిక కౌన్సిలర్ భర్త చెప్పుతో దాడి చేశార‌ని తెలిపారు. ఈ దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు బంద్ పిలుపు ఇస్తే, ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా బంద్ పాటిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌శాంతంగా బంద్ జరుగుతుంటే అక్ర‌మంగా అరెస్టులు చేయడం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like