అమ్మ‌, అమ్మ‌మ్మ క‌లిసి చంపేశారు..

తమ మాట వినటం లేదని తన తల్లితో కలిసి కుమార్తెను హత్య చేసిందో త‌ల్లి.. వీరిద్ద‌రినీ పోలీసులు అరెస్టు చేశారు. ఉబ్బ‌ని స‌మ్మ‌క్క ప‌ర్వ‌త‌గిరి మండల కేంద్రంలో కూర‌గాయ‌ల వ్యాపారం చేస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె అంజలి తల్లి వద్ద వుంటూ స్థానిక పాఠశాలలో పదవతరగతి చదువుతోంది. కొద్ది రోజులుగా మృతురాలు అంజలి అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది. తమ కులానికి చెందిన వ్యక్తికాక పోవడంతో మృతురాలి ప్రేమను అంగీకరించలేదు. ప్రశాంత్ తో ప్రేమ వ్యవహరాన్ని కొనసాగించవద్దని తల్లి, అమ్మమ్మ అంజలిని ఎన్నోసార్లు హెచ్చ‌రించారు. అంజలి వ్యవహరశైలి ఎలాంటి మార్పు రాకపోవడంతో తమ కుటుంబ పరువు తీస్తోందని ఆమెను చంపేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. గత నెల 19న అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న మృతురాలిని తల్లి గొంతు నులిమింది. అమ్మమ్మ అంజలి ముఖంపై దిండుతో అదిమి పెట్టి ఊపిరి అడకుండా చేసి హత్యచేశారు. అనంతరం నిందితులు ఇద్దరు ఇంటి నుండి బయటి వచ్చి గ‌ట్టిగా అరుస్తూ, ఏడుస్తూ తన కుమార్తె ఏదో మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా న‌మ్మించారు. పర్వతగిరి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు అస‌లు నిందితులు మృతురాలి త‌ల్లి ఉబ్బ‌ని స‌మ్మ‌క్క‌, అమ్మమ్మ నాము యాక‌మ్మ‌గా తేల్చారు. ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మీ వివరాలను వెల్ల‌డించారు. ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్టు చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచిన‌ట్లు ఆమె చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like