అమ్మ‌లాగా అంగ‌న్‌వాడీల సేవ‌లు..

అంగ‌న్వాడీ టీచ‌ర్లు సొంత అమ్మ‌లాగా సేవ‌లందిస్తార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గంలో అంగన్వాడి టీచర్లు ఆయాలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు ప్రతి కార్యక్రమాన్ని సొంత పని లాగా భావించి ప‌నులు చేస్తార‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలు వారి ప్రసూతి తర్వాత ఆ తల్లి బిడ్డ లకు పౌష్టికాహారం అందిస్తున్న ఆరోగ్యాన్ని కాపాడుతున్నది ఈ అంగన్వాడీ కేంద్రాలేన‌న్నారు. ప్రతి గ్రామంలో పొద్దున్న లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు అంగన్వాడీ టీచర్ల‌ పాత్ర లేనిదే ఏదీ జరగదన్నారు. క‌రోనా కాలంలో వారి సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌న్నారు.

అంగన్వాడీ వ్యవస్థ దేశం మొత్తం ఉన్న‌ద‌ని కానీ తెలంగాణ‌లో వారికి ఉన్న సౌక‌ర్యాలు గానీ, గౌర‌వం కానీ మ‌రెక్క‌డా లేద‌న్నారు. తల్లి గర్భం నుంచి ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు సొంత తల్లి లాగా ప్రేమ చూపి, ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలు ఏవైనా కూడా ప్రజల గడపలకు వేసేందుకు అంగన్వాడి టీచర్లు ముందుంటారని చెప్పారు. అంగ‌న్‌వాడీల సేవ‌లను గ‌త ప్ర‌భుత్వాలు గుర్తించ‌లేద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక టీచర్లు కూడా ఆత్మస్థైర్యంతో మెలిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని అన్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు వారి గౌరవ వేతనం పెంచిన‌ట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ధర్మపురి మండలం జడ్పిటిసి ఎంపీపీ జిల్లా సంక్షేమ అధికారి జిల్లా బాలల పరిరక్షణ అధికారి సిడిపిఓలు సూపర్వైజర్లు ఇతర అధికారులతో పాటు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like