అమ్మ రాజీనామా

వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజ‌య‌మ్మ రాజీనామా

వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేసారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఎమోష‌న‌ల్ అయ్యారు. శుక్రవారం గుంటూరులో జిరిగిన వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో ఆమె తాను వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకొని.. అటు జ‌గ‌న్‌,ఇటు ష‌ర్మిల‌ తల్లిగా బాధ్యతగా వారి వెనుక నిలుస్తానని స్పష్టం చేసారు. వైఎస్ఆర్ భార్యగా రెండు రాష్ట్రాల్లో తాను ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు తనను అంగీకరిస్తారన్నారు. వక్రీకరణలకు, కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు ఉన్నాయనే ప్రచారానికి తావివ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తాను వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.

తెలంగాణలో తన కూతురు వైఎస్ షర్మిల పార్టీని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ప్రయత్నం చేస్తుందన్నారు. ఏపీలో మరోసారి జగన్ పార్టీని అధికారంలోకి వస్తాడని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఈ ఇద్దరి బిడ్డలకు తల్లిగా అండగా ఉంటానని చెప్పారు. తాను రాయని రాజీనామా లేఖ సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన విష‌యాన్ని ఆమె ప్రస్తావించారు.ఈ లేఖలో జగన్ కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ లేఖలో పిచ్చి రాతలు రాశారని విజ‌య‌మ్మ‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like