అమ్మ‌కు పురిటి క‌ష్టాలు..

పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న ఓ గ‌ర్భిణీ ఆసుప‌త్రికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. భారీ వ‌ర్షాల‌కు క‌ల్వ‌ర్టు కూలిపోవ‌డంతో ఆ గ్రామానికి 108 రాలేక ఆగిపోయింది. దీంతో చేతుల మీద మోసుకు వెళ్లారు ఆమె కుటుంబ‌సభ్యులు…

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగు ప్రవాహ ధాటికి క‌ల్వ‌ర్టు కూలిపోయింది. అక్క‌డ నుంచి జ‌ల్దా గ్రామానికి రోడ్డు సౌక‌ర్యం ఉంది. అయితే, ఆ కల్వర్టు కూలడంతో జల్దా గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని తీసుకువ‌చ్చేందుకు 108 బ‌య‌ల్దేరింది. క‌ల్వ‌ర్టు కూలిపోవ‌డంతో వాగు దాట లేక అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది. ఇచ్చోడ మండలం జల్దా గ్రామానికి చెందిన జాద‌వ్ జయశ్రీ అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా డెలివరీ కోసం అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలో సిరిచెల్మ మార్గం లో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వరద ధాటికి కల్వర్టు కూలిపోవ‌డంతో అంబులెన్స్ నిలిచి పోయింది. అంబులెన్స్ రాక‌పోవడంతో గ‌ర్భిణీని చేతుల‌పై ఎత్తుకుని వెళ్లారు. జాతీయ ర‌హ‌దారిపై నిలిచిన అంబులెన్స్‌లో ఎక్క‌డించి ఇచ్చోడ ప్రాథమిక ఆసుపత్రి కు తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like