అమెరికాలోనూ అదిరింది…

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ మాసీవ్ కాంబోలో వ‌చ్చిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, మేకింగ్ వీడియోలు, సాంగ్స్ ఈ అంచనాలను తార స్థాయికి చేర్చాయి. శుక్రవారం వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఇక ఓవర్సీస్‌లో కూడా ఆర్ఆర్ఆర్‌ను భారీగానే విడుదల చేశారు. దీనిలో భాగంగా అమెరికాలో అయితే ఇంతకుముందు ఏ భారతీయ చిత్రం విడుదల కాని విధంగా అత్యధిక లొకేషన్స్‌లో ప్రదర్శితం అవుతోంది. అక్కడ ఈ సినిమాను విడుదల చేస్తున్న సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ దేశ వ్యాప్తంగా 1150కు పైగా లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.

అమెరికాలో ఆర్ఆర్ఆర్ అప్పుడే రికార్డుల వేట మొదలెట్టింది. ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా ఈ మూవీ ఏకంగా 2.5 మిలియన్ డాలర్లుకు(సుమారు రూ.18కోట్లు) పైగా రాబట్టిందని సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించాయి. దీంతో ‘బహుబలి-2’ (2.4 మిలియన్ డాలర్లు) రికార్డును దాటేసింది. అలాగే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. యూఎస్‌లో సినీమార్క్ అనే సింగిల్ చైన్ ద్వారానే ప్రీమియర్ ప్రీ సేల్స్‌తో ఏకంగా 1మిలియన్ డాలర్లకు(సుమారు రూ.7.50కోట్లు) పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో ఇంతకుముందు ‘బహుబలి-2’ (రూ.7.25కోట్లు) రికార్డు బద్దలైంది. ఇలా ప్రీమియర్స్‌తోనే అగ్రరాజ్యంలో ప్రభంజనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ ఇంకెన్నీ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

సినిమా విడుద‌ల సంద‌ర్బంగా అమెరికావ్యాప్తంగా అభిమానులు పండుగ చేసుకున్నారు. థియేట‌ర్ల వ‌ద్ద ట‌పాసులు కాల్చారు. పెద్ద ఎత్తున కేకులు కోసి అభిమానం చాటుకున్నారు. అమెరికాలో ముందు రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. కాలిఫోర్నియ‌లోని ఫ్రెమాంట్ గ్రాండ్ థియేట‌ర్‌లో ర‌చ్చ చేశారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉంద‌ని, ఫ‌స్ట్ ఆఫ్ అయితే అదిరిపోయింద‌ని మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి వాసి, ఎన్ఆర్ఐ కృష్ణారెడ్డి నాంది స్యూస్‌కు చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like