అంత‌ర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు

-14,190 మందికి విముక్తి
-17 మంది అరెస్ట్

ప్ర‌త్యేక వెబ్‌సైట్లు… వాట్సాప్ గ్రూపులు, కాల్ సెంటర్లు ఇదంతా ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిందో అనుకుంటే పొర‌పాటే… అంత‌ర్జాతీయంగా వేళ్లునూకున్న సెక్స్ రాకెట్ ఏర్పాట్లు ఇవ‌న్నీ… దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో సైతం ఓ ముఠా వ్య‌భిచారం నిర్వ‌హిస్తోంది. హైదాబాద్ పోలీసులు ఈ ముఠా గుట్టుర‌ట్టు చేశారు.

అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ను హైదరాబాద్ పోలీసులు చేధించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ముంబయితో పాటు బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, రష్యాకు చెందిన మ‌హిళ‌ల‌తో వీరు వ్య‌భిచార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నారు. మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నామ‌ని చెప్పి పలు వెబ్ సైట్ల ద్వారా ఎస్కార్ట్ పేరుతో ఈ వ్యభిచారాన్నికొన‌సాగిస్తున్నారు. వెబ్ సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి.. అమ్మాయిలను పంపిస్తున్నారు. ఏకంగా విమానాల్లో కూడా అమ్మాయిలను ఇతర రాష్ట్రాల కస్టమర్ల దగ్గరకు పంపుతున్నారంటే ఈ దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్ధం చేసుకోవ‌చ్చు.

వ్యభిచారం ద్వారా వచ్చిన డబ్బులో కేవ‌లం 30శాతం మాత్ర‌మే బాధిత యువతులకు అంద‌చేస్తున్నారు. మిగ‌తా 35శాతం యాడ్స్, వెబ్ సైట్స్​ కు మిగతా 35 శాతం నిర్వాహకులు తీసుకుంటున్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ మొత్తం సెక్స్ రాకెట్‌కు ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇత‌ను సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ లో డ్రగ్స్, వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. కేవ‌లం హైద‌రాబాద్‌లోనే 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు.

సోమాజిగూడలో కీలక నిందితుడు ఆర్నావ్ ను అరెస్ట్​ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆర్నావ్ ఇంట్లోనే MDMA డ్రగ్స్ ను సీజ్ చేశామన్నారు. సెక్స్ రాకెట్ ముఠా సభ్యులు వివిధ గ్రూపులుగా విడిపోయి దందా చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కొన్ని హోటల్స్ లో పని చేసే వాళ్ల కూడా ప్రమేయం ఉందని, వారిని కూడా అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 14,190 మందికి విముక్తి కల్పించామ‌ని, ఇందులో ప్ర‌మేయం ఉన్న 17 మందిని అరెస్ట్ చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఉద్యోగాలు లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న యువతులను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని తమ విచారణ‌లో వెల్లడైందని చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like