యాంక‌ర్ల ఓవ‌రాక్ష‌న్‌.. ఏడ్చేసిన కృతిశెట్టి..

చిన్న ఏజ్ లో హీరోయిన్‌గా వరుస హిట్స్ సాధిస్తోంది కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి శ్యామ్ సింగరాయ్ తో అందర్నీ ఆకట్టుకొని బంగార్రాజుతో మెప్పించి హ్యాట్రిక్ హిట్ కొట్టింది కృతి. ప్రస్తుతం సుధీర్బాబు,నితిన్,రామ్ తమిళ్లో సూర్యతో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. . వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు రామ్ సరసన ది వారియర్లో నటిస్తోంది.

ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రస్తుతం ఈ సిని బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.కృతిశెట్టి కూడా ప్రమోషన్ లో భాగంగా బిహైండ్ వుడ్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ హాజర‌య్యింది. ఇందులో కృతిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. ఇందుకు తమిళ ప్రాంక్ యూట్యూబర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ జరుగుతుండగా వీరిద్దరూ బిగ్గరగా అరుస్తూ కృతిశెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. హీరోయిన్ ఎదుటే కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక కృతి భయపడిపోయి..చెమటలు పట్టేశాయి.

దీంతో యాంక‌ర్లు ఇది ప్రాంక్ అని చెప్పారు. అయినా దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది కృతిశెట్టి. పాపం చిన్న పిల్లలా ఏడ్చేసింది. దీంతో వారు ఏమైంది ..సారీ సారీ అంటూ కూల్ చేశారు. తరువాత నార్మల్ అయినా కృతిని వాళ్లు ఏమైందని ప్రశ్నించడంతో ఎవరైనా కఠినంగా మాట్లాడితే తనకు నచ్చదు అంటూ చెప్పుకొచ్చింది. కృతి ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రాంక్ చేసిన వారిని దుమ్మెత్తిపోస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like