అండ‌గా ఉంటాం… అధైర్య‌ప‌డొద్దు..

-లోత‌ట్టు ప్రాంతాల‌ను సంద‌ర్శించిన న‌డిపెల్లి విజిత్‌
-75 కుటుంబాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు

మంచిర్యాల : బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని… ఏ విధంగానూ అధైర్యప‌డొద్ద‌ని టీఆర్ఎస్ యువ‌నాయకుడు, న‌డిపెల్లి ట్ర‌స్ట్ చైర్మ‌న్ విజిత్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న వ‌ర‌ద నీటితో మునిగిన మంచిర్యాల ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల‌తో పాటు, న‌స్పూరు మున్సిపాలిటీలో ప‌ర్య‌టించారు. వరద నీరు వచ్చిన కుటుంబాలను ప‌రామ‌ర్శించారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వినూత్న కాలనీ లో వరద ప్రవాహం కారణంగా సుమారు 75 ఇండ్లు నీట మునిగిపోయాయి. బుధ‌వారం రాత్రి నుండి వారిని కాపాడేందుకు బోట్ల‌ను ఏర్పాటు చేశారు. ఆ కుటుంబాల‌ను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఈ కార్యక్రమంలో న‌డిపెల్లివిజిత్ తో పాటు న‌స్పూరు మున్సిపాలిటీ చైర్మన్ ఈసం పెల్లి ప్రభాకర్, వైస్‌ చైర్మన్ తోట శ్రీనివాస్‌, టీఆర్ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, నస్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like