అంద‌రి టీవీ.. ఆన్ లైన్ పాటల పోటీలు

సంక్రాంతి పండుగ సందర్బంగా ఆన్ లైన్ లో పాట‌ల పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు అంజలి మీడియా గ్రూప్స్ నిర్వాహ‌కులు తెలిపారు. ఈ పాటల పల్లకి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు ఏదైనా సినిమా, జానపద, భక్తి పాటను ట్రాక్ మ్యూజిక్ పైన కానీ అది లేకున్నా పాట‌ పాడి వీడియో రికార్డు చేసి పంపాలి. ఎలాంటి ఎడిటింగ్,మిక్సింగ్ ఉండొద్ద‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. తీసే వీడియో మొత్తం మీ మొబైల్ ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలని కోరారు. సెల్ఫీ మోడ్ లో తీసిన వీడియోలు అనుమతించమ‌ని వారు స్ప‌ష్టం చేశారు. ప్రథ‌మ,ద్వితీయ,తృతీయ బహుమతులు ఇస్తామ‌ని విజేతలకు షీల్డ్,మెడల్,సర్టిఫికెట్ ఇవ్వనున్న‌ట్లు వెల్ల‌డించారు. అధిక వ్యూస్ ఉన్న వారికి కూడా (పబ్లిక్ పోల్) ముగ్గురిని ఎంపిక చేసి బహుమతులు ఇస్తామ‌న్నారు. వీడియోలు 9848413079 వాట్సాప్ / టెలిగ్రామ్ నెంబర్ కు పంపాల‌ని కోరారు. ఎంట్రీలు పంపించాల్సిన చివ‌రి తేదీ 15.01.2022 అని స్ప‌ష్టం చేశారు. వయసుతో ప‌రిమితి లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చ‌న్నారు. మ‌రిన్ని వివరాలకు ప్రోగ్రాం డైరెక్టర్ అనుమాండ్ల నాగరాజు 77802 64089 ను సంప్రదించాల‌ని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like