అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు

మారుతున్న కాలంలో ప్రజలకు అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు వస్తున్నాయని మంచిర్యాల ఎం ఎల్ ఎ నడిపల్లి దివాకర్ రావు అన్నారు. గురువారం ఆయన ఆపిల్ డెంటల్ క్లినిక్ , ట్రామ కేర్ సెంటర్ బెల్లంపల్లి ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్యతో కల్సి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మంచి వైద్య సేవలు కావాలంటే కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని తెలిపారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఇక్కడ ఆసుపత్రి ప్రారంభించిన వైద్యులను అభినందించారు. అనంతరం ఈ వైద్యశాలను జడ్పి ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్మి, మాజీ విప్ నల్లాల ఓదెలు సందర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like