అన్న‌దాత‌.. క్ష‌మించు…

నువ్వే వెన్నెముక అని చెబుతాం.. కానీ, నీ వెన్నుముక విరుస్తాం
బుర‌ద నుంచి బంగారం పండించే నిన్నే ఆ బుద‌ర‌లో తొక్కేస్తాం..
నిన్ను ఆర్థికంగ ఆదుకుంటున్న‌మ‌ని జ‌బ్బ‌లు చ‌రుకుంటుం..
నీవు పండించే పంట నీకు కాకుండా చేస్తం..

ర‌క్తాన్ని చెమ‌ట చుక్క‌లా మార్చే నీవు మాకు అవ‌సరం లేదు..
నీ ఓటు కావాలి… మేమెక్కే సీటు కావాలి..
నువ్వు మాకు మ‌నిషివి కూడా కాదు.. కేవ‌లం ఓటు బ్యాంకువి మాత్ర‌మే..

కానీ, మా వాళ్ల‌కు తెలియ‌ని విష‌యం ఒక‌టుంది..
నీ ముందు మేం బిచ్చ‌గాళ్ల‌మ‌ని,
నీ చేయి ఎప్పుడు పైనే ఉంటుంద‌ని, మా చేయి కింద‌ని..
నీకు ఆగ్ర‌హం వ‌స్తే మేమంతా ఆక‌లి చావులు చావాల్సి వ‌స్తుందని,
ఈ డ‌బ్బు, వ‌స్తువులు మ‌మ్మ‌ల్ని కాపాడ‌లేవ‌ని..

రైత‌న్నా… క‌న్నీరు పెట్ట‌కు.. కాడి ప‌డేయ‌కు..
త‌న‌తో మ‌మేక‌య్యే నీతో ప్ర‌కృతి త‌ల్లి దోస్తీ చేసే రోజొస్తుంది..
ప్ర‌పంచం నీ పాదాల ముందు మోక‌రిల్లే క్ష‌ణ‌మోస్తుంది..
ఆ రోజు కోసం నీతో పాటు నాలాంటి వాళ్లం ఎదురుచూస్తున్నం..

అకాల వ‌ర్షంతో కొట్టుకుపోతున్న త‌న పంట‌ను నీళ్ల‌లో దేవులాడుకుంటున్న రైతుల‌ను చూసి క‌న్నీళ్ల‌తో…
నాంది న్యూస్‌..

Get real time updates directly on you device, subscribe now.

You might also like