బుగ్గ జాతరకు ఏర్పాట్లు ముమ్మరం

Arrangements for the Bugga fair are in full swing : తాండూరు మండ‌లం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ జాతర పనులు చురుకుగా కొన‌సాగుతున్నాయి. జాతర సమయం దగ్గర పడుతుండడంతో ఇత‌ర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కన్నాల నుంచి దేవాలయానికి వచ్చే రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను సోమ‌వారం జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో చదును చేయించారు. రహదారి పనులను కూడా చేయించారు. కోనేటిలో స్నానం ఆచరించే భక్తుల సౌకర్యార్థం కోనేరు సైతం శుభ్రం చేయించారు. ఇక ఇక్క‌డ‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు నీటి కోసం ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు బావుల‌ను సైతం ఏర్పాటు చేశారు.

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా పూర్తి ఏర్పాటు చేస్తున్నామ‌ని బుగ్గ ఆల‌య క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్ మాసాడి శ్రీదేవి వెల్ల‌డించారు. జాతర సందర్భంగా వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా పాలక కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవ సంస్థల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నామ‌ని అన్నారు. జ‌రుగుతున్న ప‌నుల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని, భ‌క్తుల‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like