అస‌దుద్దీన్ వ్యాఖ్య‌లు బాధించాయి.. అందుకే కాల్పులు

లక్నో : మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, దీంతోనే ఒవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారన్నారు. నిందులిద్దరిని కోర్టులో హాజరు పరుస్తామ‌ని ప్ర‌శాంత్‌కుమార్‌ చెప్పారు. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్‌ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. హపూర్‌- ఘజియాబాద్‌ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like