అసలు దోషులు అధికారులే..

బుగ్గ‌దేవాల‌యంలో దేవాదాయ శాఖ నిర్ల‌క్ష్యం - పట్టించుకోని అధికార ఘ‌నం

మంచిర్యాల – బెల్లంప‌ల్లిలోని బుగ్గ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో అవినీతి య‌ధేఛ్చగా కొన‌సాగుతోంది. దీనిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌హ‌రిస్తున్నారు. దీంతో ఇక్క‌డ అయ్య‌గారు , సిబ్బంది ఆడింది ఆట‌ పాడింది పాట‌గా మారింది.
బుగ్గ‌రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌మ‌యానికి గుడిని కూడా తెర‌వ‌డం లేదు. దీంతో భ‌క్తులు ద‌ర్శ‌నానికి వ‌చ్చి కొన్ని సంద‌ర్భాలాలో వెనుదిరిగి వెళ్లాల్సి వ‌చ్చింది. ఈవిష‌యంలో సిబ్బందికి భ‌క్తుల‌కు మ‌ధ్య ప‌లు మార్లు గొడ‌వ‌లు సైతం జ‌రిగాయి. ఎన్ని సార్లు అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ఇటువైపు క‌న్నెత్తి చూసిన పాపాన పోలేదు. త‌మ‌ను అడిగే వారు లేక‌పోవ‌డంతో అటు సిబ్బంది,ఇటు అయ్య‌గారు ఇష్ట‌రీతినా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మూడేళ్లుగా లెక్క‌లు లేవు..

ఆల‌యానికి సంబంధించి లెక్క‌ల విష‌యం లో సైతం నిర్ల‌క్ష్య ధోర‌ణి కొన‌సాగుతోంది. ఆదాయ‌,ఖర్చుల‌కు సంబంధించి పొంత‌న లేక‌పోవ‌డంతో ఇక్క‌డి నిధులు సా్హా అయ్యాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కొన్ని సంద‌ర్భాలలో డెక‌రేష‌న్ చేసే వారుతో స‌హా మ‌రి కొంద‌రికి ఆల‌యం నుంచి డ‌బ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే వారికి డ‌బ్బులు చెల్లించిన‌ట్లుగా నిధు స్వాహా చేసిన‌ట్లు స‌మాచారం. హుండీలో డ‌బ్బులు సైతం కొంద‌రి చేతి వాటం చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

డీవీఆర్ మాయం చేసింది వాళ్లేనా..

సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌వ‌ని అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా సీసీ పుటేజీలు రికార్డు అయ్యే డీవీఆరే మాయ‌మైంది. దీని వెనుక సిబ్బంది పాత్ర ఉంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత జ‌రుగుతున్నా అధికారులు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం పై అనుమానాలు త‌లెత్తున్నాయి.

స‌మ‌యానికి తెరుచుకోని త‌లుపులు
బుగ్గ‌రాజ‌రాజేశ్వ‌ర దేవాల‌యం ఎప్పుడు స‌మ‌యానికి తెరుచుకోద‌ని భ‌క్తులు ఆరోపిస్తున్నారు. వాస్త‌వానికి ఎండోమెంట్ సిబ్బంది వ‌చ్చి త‌లుపులు తెరిచి స‌మ‌యం వ‌ర‌కు ఉండాలి. అది ఏమి జ‌ర‌గ‌డం లేదు. కార్తీక మాసం లాంటి స‌మ‌గ్ర దినాల్లో సైతం తొమ్మ‌ది ప‌ది గంట‌ల వ‌ర‌కు కూడా ఆల‌యం తెరుచుకోవ‌డం లేదు. దీనిపై భ‌క్తుకోరుకుంటున్నారుల‌కు సిబ్బందికి ఎన్నో మార్లు గొడ‌వ‌లు అవుతున్నాయి.తాజాగా నాలుగు రోజుల కితం సైతం ఈ విష‌యంలో గొడ‌వ జ‌రిగింది. మ‌రో వైపు అయ్య‌గారు సైతం భ‌క్తుల ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటువంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌క్తులు హెచ్చ‌రిస్తున్నారు.బుగ్గ దేవాల‌యం స‌మూల ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాల‌ని భ‌క్తులు .

Get real time updates directly on you device, subscribe now.

You might also like