చాప‌ చుట్టేశారు..

Asia Cup Final: ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన ఇండియా డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంకపై 10 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. దాంతో, టీమిండియా ఎనిమిదోసారి ఆసియా క‌ప్ చాంపియ‌న్‌గా నిలిచింది. భార‌త జ‌ట్టు ఇంత‌కుముందు 1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018లో ఆసియా క‌ప్‌ను ముద్దాడింది.

ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ అదరగొట్టింది. ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా సిరాజ్.. నిప్పులు చెరిగే బంతులు విసిరాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఏడు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. 51 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే ఛేదించింది. బంతుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఆసియా కప్‌ ట్రోఫీని భారత్ ఎనిమిదో సారి సొంతం చేసుకుంది. నేడు ఏకపక్షంగా జరిగిన ఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 51 పరుగుల లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం ఎంత తప్పో.. మ్యాచు ప్రారంభమైన కాసేపటికే అర్థం అయింది. భారత బౌలర్లను ఎదుర్కోవడంతో శ్రీలంక బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పరుగులు చేయడం అటుంచితే.. వికెట్లు కాపాడుకునేందుకే ఆపసోపాలు పడ్డారు.

తొలి ఓవర్‌లో బుమ్రా.. కుశాల్ పెరీరాను పెవిలియన్ చేర్చాడు. ఇక అప్పటి నుంచి హైదరాబాదీ సిరాజ్ మీయా హవా మొదలైంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో 4 వికెట్లు తీశాడు సిరాజ్. బంతి పడటమే ఆలస్యం వికెట్ వస్తుందా అనేంతలా సిరాజ్ బౌలింగ్ సాగింది. దీంతో మియాన్ బౌలింగ్‌కు శ్రీలంక బ్యాటర్లు దాసోహమయ్యారు. 12 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఏమాత్రం కోలుకోలేక పోయింది. హార్దిక్ పాండ్యా కూడా 3 వికెట్లు తీయడంతో 15.2 ఓవర్లలోనే 50 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం భారత్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. స్వల్ప స్కోరే కావడంతో రోహిత్ శర్మ ఓపెనింగ్ రాకుండా ఇషాన్ కిషన్‌కు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ జోడీ ఎడా పెడా బౌండరీలతో చెలరేగిపోయింది. 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 23, శుభ్‌మన్ గిల్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బంతుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. మరో 263 బంతులు ఉండగానే టీమిండియా విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ ట్రోఫీని 8వ సారి ముద్దాడింది.

టీమిండియాకు రెండోసారి ఈ మెగా ట్రోఫీ అందించిన మూడో కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డు సొంతం చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ సార‌థ్యంలో 1991, 1995లో మ‌న జ‌ట్టు చాంపియ‌న్‌గా నిలిచింది. మ‌హేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భార‌త్ 2010, 2016లో ట్రోఫీని నిల‌బెట్టుకుంది. మ‌రోవైపు శ్రీ‌లంక‌తో జ‌రిగిన ఫైన‌ల్లో టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్(Mohammad Siraj) కెరీర్‌లోనే ఉత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. 7 ఓవ‌ర్లు వేసిన సిరాజ్ 21 ర‌న్స్ ఇచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దాంతో, శ్రీ‌లంక దిగ్గ‌జం అజంత మెండిస్ రికార్డు స‌మం చేశాడు. అంతేకాదు ఓకే ఓవ‌ర్‌లో 4 వికెట్లు తీసిన తొలి భార‌త బౌల‌ర్‌గా ఈ హైద‌రబాదీ రికార్డు నెల‌కొల్పాడు.

శ్రీ‌లంక నిర్దేశించిన 51 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త జ‌ట్టు 6.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. లంక‌పై భారీ విక్ట‌రీతో వ‌న్డేల్లో ప‌లు రికార్డులు తిర‌గ‌రాసింది. అవును.. టీమిండియాకు వ‌న్డేల్లో ఇదే భారీ విజ‌యం. 263 బంతులు మిగిలి ఉండ‌గానే గెలిచిన భార‌త్ మ‌రో రికార్డు సృష్టించింది. ఇదే ఏడాది ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా (226 బంతులు) నెల‌కొల్పిన రికార్డును బ‌ద్ధ‌లు కొట్టింది. వ‌న్డే ఫార్మాట్‌లో జ‌రిగిన‌ ఫైన‌ల్స్‌లో భార‌త జ‌ట్టు 10 వికెట్ల తేడాతో గెలవ‌డం ఇది రెండోసారి. మొద‌టిసారి 1998లో జింబాబ్వేపై 197 ప‌రుగుల ల‌క్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా చేధించింది. 2003లో ఆస్ట్రేలియా జ‌ట్టుకు ఇంగ్లండ్ 118 టార్గెట్ విధించింది. స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో కంగారు జ‌ట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like