అయ్యో… ఎంత ప‌నాయే..?

రాజ‌కీయాల్లో ఎంత వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటే అంత ముందుకు వెళ్లొచ్చు.. అటు సొంతంగా ఇటు పార్టీకి అలాంటివి మేలు చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఈ మ‌ధ్య కాలంలో ఒక నిర్ణ‌యం తీసుకోవ‌డంలో చేసిన ఆల‌స్యం ఆ పార్టీకి న‌ష్టం చేసింది. దాని గురించే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది.

ఈటెల రాజేంద‌ర్‌.. ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ వ్య‌క్తి. ఆయ‌న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ద‌గ్గ‌ర నుంచి ఈ రోజు వ‌ర‌కు ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అవుతున్నారు. అధికార టీఆర్ఎస్ అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా ఆయ‌న గెలుపు ఆప‌లేక‌పోయారు. పోరాడి గెలిచి శభాష్ అనిపించుకున్నారు. అయితే ఇది నాణేనికి ఒక‌వైపు.. అస‌లు ఆయ‌న త‌న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన త‌ర్వాత ఈటల రాజేంద‌ర్ బీజేపీలోకి వెళ్లేముందు కాంగ్రెస్‌ నేతలకి టచ్‌లోకి వ‌చ్చార‌ట‌. కానీ ఇతర కారణాలతో కమలతీర్థం పుచ్చుకున్నారన్న చర్చ నేటికీ నడుస్తోంది.

నాలుగు రోజుల‌ కింద‌ట జ‌రిగిన ఒక స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈటల మొదలు మా దగ్గరికే వచ్చిండబ్బా అంటూ చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ ముందు మా దగ్గరికే వచ్చాడు.. అప్పుడే గట్టిగా పట్టుకునేదుండే.. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మా రేవంతే చెప్పాలి అంటూ కామెంట్స్ చేశారు. త‌ర్వాత విష‌యాల‌న్నీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికే తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఈటల కాంగ్రెస్‌లోకి వెళ్తారని జరిగిన ప్రచారం జ‌రిగింది. నిజంగా ఈట‌ల రాజేంద‌ర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తే పార్టీకి ఎంతో బ‌లం పెరిగేద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అది పెద్ద బూస్ట‌ర్‌లాగా ప‌నిచేసేద‌ని ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like