బైరి న‌రేష్‌కు మ‌రోసారి దేహ‌శుద్ది

-మ‌రోసారి అయ్య‌ప్ప‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు
-ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అయ్య‌ప్ప భ‌క్తులు
- పోలీస్ వాహ‌నం నుంచి కింద‌కు లాగి దాడి

నాస్తికుడు బైరి న‌రేష్ కు అయ్య‌ప్ప భ‌క్తులు మ‌రోసారి దేహ‌శుద్ధి చేశారు. ఓ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి జైలుకు వెళ్లి వ‌చ్చినా త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకోకుండా తిరిగి అయ్య‌ప్ప‌పై వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో వారు దాడికి పాల్ప‌డ్డారు.

అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో బైరి నరేష్ కు అయ్యప్ప భక్తులు దేహ‌శుద్ధి చేశారు. పోలీస్ వాహ‌నంలో ర‌క్ష‌ణ‌గా వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దాడి చేశారు. న‌రేష్‌ గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లాడు జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి వివాస్పద వాఖ్యలు చేశాడు. ఆయ‌న త‌న తీరు మార్చుకోకుండా అయ్య‌ప్ప‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని అందుకే తాము దాడి చేసినట్లు అయ్యప్ప భక్తులు వెల్ల‌డించారు. దాడి అనంతరం బైరి నరేష్ మాట్లాడుతూ త‌న‌పై దాడి చేస్తారనే పోలీసులను రక్షణ అడిగానని, పోలీసుల వాహనంలో ఉండగానే నాపై దాడి చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరాడు. నాకు గన్ లైసెన్స్ కావాలని బైరి న‌రేష్ డిమాండ్ చేశాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like