బల పరీక్ష ఎదుర్కొవాల్సిందే

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రేపు బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కొనుంది. మహారాష్ట్ర సంక్షోభం పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బల ల్రీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బల పరీక్ష పై గవర్నర్ నిర్ణయం సమర్దించిన కోర్టు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బల పరీక్ష ఎదురుకోనున్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే రాజీనామా చేస్తా అని ఉద్దవ ఠాక్రే స్పష్టం చేశారు. దీంతో ఆయన కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి రాజీనామా చేసే అవకాశం ఉందని పలువురు చెప్తున్నారు.

ఇక ఈ రోజు నేడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న మ‌హారాష్ట్ర కేబినెట్‌.మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్ స‌మావేశ‌మైంది. ఔరంగాబాద్ పేరును సాంబాజీన‌గ‌ర్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నో ఏళ్ళుగా ఔరంగాబాద్ పేరును మార్చాల‌ని డిమాండ్ ఉంది. మ‌హారాష్ట్ర స‌ర్కారు దీనిపై నిర్ణయం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. అలాగే, నావీ ముంబైలోని కొత్త విమానాశ్ర‌యానికి డీబీ పాటిల్ పేరు పెట్టాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. అంతేగాక‌, ఉస్మానాబాద్‌కు ధారాశివ్‌గా పేరు మార్చాల‌ని కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. కాగా, కేబినెట్ భేటీ అనంత‌రం మీడియా ముందు రెండు చేతులు జోడించి ఉద్ధ‌వ్ ఠాక్రే అభివాదం చేశారు. ఆయ‌న రాజీనామా చేయ‌బోతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like