రికార్డు ధ‌ర ప‌లికి బాలాపూర్ ల‌డ్డూ

రూ. 24 లక్షల 64 వేలతో ద‌క్కించుకున్న వంగిటి లక్ష్మారెడ్డి

Balapur Laddu fetches record price: లడ్డూ వేలంపాటలో 27 ఏళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న బాలాపూర్ గణేశుడి ల‌డ్డూ ఈసారి కూడా రికార్డు స్థాయి ధ‌ర ప‌లికింది. గతేడాది రూ. 18.90 ల‌క్ష‌ల‌కు లడ్డూను దక్కించుకోగా… ఈసారి కూడా రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలికింది.

గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతోపాటు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వందల, వేలు దాటి రికార్డుస్థాయిలో లక్షలు పలుకుతోంది. సుమారు 20మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది. లడ్డూను దక్కించుకునేందుకు పడే పోటీ.. ఆద్యంతం రసవత్తరంగా ఉంటుంది.

బాలాపూర్‌ లడ్డూ సంప్రదాయం 1980లో ప్రారంభమవ్వగా.. వేలం మాత్రం 1994లో మొదలైంది. 1994లో 450 రూపాయలతో మొదలైన బాలాపూర్ గణేశుడి లడ్డూ ల‌క్షల్లో ప‌లుకుతోంది. 2001వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. గతేడాది అట్టహాసంగా జరిగిన వేలంపాటలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ రామేశ్ యాదవ్.. నాదర్గుల్ కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి 18 లక్షల 90 వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది రెండు నుంచి మూడు లక్షలు అదనంగా పలకవచ్చని ఉత్సవ సమితి భావించింది. కానీ ఏకంగా రూ. 24.64 ల‌క్ష‌ల‌కు వంగిటి లక్ష్మారెడ్డి అనే భ‌క్తుడు ద‌క్కించుకున్నారు. బాలాపూర్‌ గణేషుడి లడ్డూ ప్రతి ఏడాది 21కిలోల బరువుతో తయారు చేస్తారు.

సంఖ్య సంవత్సరం లడ్డూ దక్కించుకున్న దాత పేరు లడ్డూ పలికిన ధర రూ.లక్షలలో

1 2021 ఎమ్మెల్సీ రామేశ్ యాదవ్(ఏపీ)మర్రి శశాంక్ రెడ్డి (నాదర్గుల్) రూ. 18,90,000
2 2020 కరోనా కారణంగా రద్దు –
3 2019 కొలను రాంరెడ్డి రూ. 17,60,000
4 2018 తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ. 16,60,000
5 2017 నాగం తిరుపతిరెడ్డి రూ. 15,60,000
6 2016 స్కైలాబ్​రెడ్డి(మేడ్చల్) రూ. 14,65,000
7 2015 కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ. 10,32,000
8 2014 సింగిరెడ్డి జైహింద్​రెడ్డి రూ. 9,50,000
9 2013 తీగల కృష్ణారెడ్డి(మాజీ ఎమ్మెల్యే) రూ. 9,26,000
10 2012 పన్నల గోవర్ధన్​రెడ్డి రూ. 7,50,000

Get real time updates directly on you device, subscribe now.

You might also like