అద‌న‌పు నిధులివ్వండి..

-మినీ స్టేడియానికి మ‌రో రూ. 1.70 కోట్లు అవ‌స‌రం
-మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ను క‌లిసిన విప్ బాల్క సుమ‌న్‌

Balka Suman appealed for additional funds: చెన్నూరు ప‌ట్ట‌ణంలో నిర్మిస్తున్న మినీ స్టేడియంలో వ‌స‌తుల కోసం అద‌న‌పు నిధులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ను కోరారు. సోమ‌వారం బాల్క సుమ‌న్ మంత్రిని మినిస్టర్ క్వార్టర్స్ లో క‌లిశారు. ప‌ట్ట‌ణంలో రూ.2.65 కోట్లతో 6.34 ఎకరాల్లో మినీ స్టేడియం నిర్మిస్తున్నారు. ఇందులో వసతుల కోసం అదనపు నిధులను అవ‌సరం అవుతాయ‌ని బాల్క మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. మినీ స్టేడియం కాంపౌండ్ వాల్ కు రూ.75 లక్షలు, ఇండోర్ స్టేడియం మిగిలి ఉన్న పనులతో పాటు, బాస్కెట్ బాల్ , టెన్నిస్ కోర్టుల నిర్మాణానికి రూ.40 లక్షలు, హైమాస్ లైట్ల ఏర్పాటుకు రూ.20 లక్షలు, వీధి దీపాల కోసం రూ.15 లక్షలు, మొక్కలు, గడ్డి కోసం రూ.20 లక్షలు అవుతాయ‌ని వెల్ల‌డించారు. మొత్తంగా అద‌న‌పు నిధులు రూ.1.70 కోట్లు కావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు మంత్రికి బాల్క సుమ‌న్ విన‌తిప‌త్రం అందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like