నేనున్నాన‌ని… మీకేం కాద‌ని…

-సీఎంఆర్ఎఫ్‌ ద్వారా పేద‌ల‌కు సాయం చేస్తున్న బాల్క సుమ‌న్
-ఇప్ప‌టి వ‌ర‌కు 199 బాధితులకు రూ. 42 కోట్ల ఆర్థిక సాయం

Balka Suman: ఏదైనా ఆప‌ద వ‌స్తే చాలు నేనున్నాని అండ‌గా నిల‌బ‌డే ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ద్వారా పేద‌ల‌కు ఆపన్న హ‌స్తం అందిస్తున్నారు. ఆ ప‌థ‌కం కింద రికార్డు స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు 199 మంది బాధితుల‌కు రూ. 42 కోట్ల ఆర్థిక సాయం అందించారు.

బాల్క సుమ‌న్ చెన్నూరు ఎమ్మెల్యే అయిన త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గం రూపురేఖ‌లే మారిపోయాయి. అదే స‌మ‌యంలో పేద‌ల‌కు స‌త్వ‌ర వైద్యం కూడా అందుతోంది. అయితే, పెద్ద పెద్ద జ‌బ్బులు వ‌చ్చినా ఇక్క‌డ న‌యం కాని వ్యాధులు వ‌చ్చినా ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయాల్సిన దుస్థితి. దీనిని దూరం చేసేందుకు ముఖ్య‌మంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరంగా మారుతున్నది. ఆరోగ్య శ్రీ సేవల కిందికి రాని శారీరక రుగ్మతలకు ఈ పథకం ఆపన్నహస్తంలా నిలుస్తున్నది. దారిద్య్ర రేఖకు దిగువ ఉండి వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి ఈ పథకం ఆదుకుని వారి ప్రాణాలు కాపాడుతున్నది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పంపిణీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

చెన్నూరులో రికార్డు స్థాయిలో ఆర్థిక సాయం..
చెన్నూరు నియోజకవర్గంలో ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ చేతుల మీదుగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 199 మంది ల‌బ్ధి దారుల‌కు రూ. 42 కోట్లకు పైగా చెక్కులను అందజేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ సీఎం సహాయనిధి కింద సాయం కోరిన ప్రతి లబ్ధిదారుడికి, వచ్చిన ప్రతి దరఖాస్తుకు త్వరగా స్పందిస్తూ ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇంటికే చెక్కులు పంపిస్తున్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతున్నారు.

కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్న పథకం
వివిధ కారణాలతో, శారీరక రుగ్మతలకు సంబంధించిన వ్యాధులు సోకిన వారు చికిత్స కోసం కార్పొరేట్‌ దవాఖానలకు పరుగెడుతున్నారు. చాలామంది దవాఖానకు అయ్యే ఖర్చుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పు చేసి వైద్య ఖర్చుల నిమిత్తం బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత అప్పు తీర్చే మార్గాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో భరోసానిస్తూ ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నది. బాల్క సుమ‌న్ ఎమ్మెల్యేగా వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రికి సాయం అందుతోంది. బాధితులకు పెద్ద ఎత్తున చెక్కులు, ఎల్‌వోసీలను అందజేశారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు – బాల్క సుమ‌న్
ఆర్థిక భారంతో ఏ ఒక్క ప్రాణం పోకూడదనే LOC ఇప్పించడంలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నాం. రాజకీయాలకతీతంగా చెక్కులు అందజేస్తున్నాం. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు త‌దిత‌రుల‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like