పీఎఫ్ఐ పై నిషేధం.. త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి..

Ban on PFI will come into effect immediately: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) దాని అనుబంధ సంస్థలli చట్టవిరుద్ధమైన సంఘాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు సంవత్సరాల పాటు వీటిమీద నిషేధం విధించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది.

పీఎఫ్ఐపై దేశంలో ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల పీఎఫ్ఐపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఈడీ వరుసదాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తోందన్న ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. ఈ నెల 22న, మళ్లీ 27(మంగళవారం) దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ దాదాపు 300 మందిని అరెస్టు చేసింది.

పీఎఫ్ఐ సంబంధించిన వివిధ సంస్థల మీద అనేక దాడుల తర్వాత, టెర్రరిస్ట్ ఫండింగ్‌తో సంబంధాలు ఉన్నాయని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) బుధవారం నిషేధించింది. దేశవ్యాప్తంగా అనేక దాడులు, దర్యాప్తు సంస్థల అరెస్టుల తరువాత, ఇవి తీవ్రవాద నిధులతో నడుస్తున్నాయని వచ్చిన ఆరోపణలపై రాడికల్ సంస్థ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) బుధవారం నిషేధించింది.

యూపీ, గుజరాత్, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్ళలో జరిపిన సోదాలలో పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశంలో ప్రముఖుల హత్యకు, రాష్ట్రాలలో హింసాత్మక ఘటనలకు పీఎఫ్ఐ కుట్రపన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలైన రిహబ్‌ ఇండి ఫౌండేషన్‌, క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌, రిహబ్‌ ఫౌండేషన్‌ కేరళపై ఐదేండ్ల పాటు నిషేధం విధించింది.

వీటిని నిషేధించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 27 తేదీల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్ర పోలీసులు పీఎఫ్‌ఐపై దాడులు చేశారు. తొలి దఫా దాడుల్లో పీఎఫ్‌ఐకి చెందిన 106 మందిని అరెస్టు చేశారు. అనంతరం, రెండవ రౌండ్ దాడులలో, PFIకి చెందిన 247 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు సంస్థలకు ఈ ముసుగు సంస్థలకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు లభించాయి, దాని ఆధారంగా వీటిని నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like