బండిని జైల్లోనే చంపేందుకు కుట్ర..

న్యాయవాది మృత్యుంజయం సంచలన వ్యాఖ్య‌లు

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంద‌ని బిజెపి సీనియర్ నేత‌, న్యాయవాది కటుకం మృత్యుంజయం ఆరోపించారు. జైలుకు వెళుతున్న సంజయ్ ని అక్కడే హతమార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. గత రాత్రి జాగరణ దీక్ష భగ్నం చేసి ఎక్కడికో తీసుకెళ్లిన పోలీసులు సోమవారం ఉదయానికి గానీ తిరిగి కరీంనగర్ తీసుకురాలేదన్నారు. ఏదో కుట్ర చేద్దామనే ఆలోచనతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మృత్యుంజయం అనుమానం వ్యక్తం చేశారు.

జైలులో అందించే ఆహారంలో విషం కలిపి సంజయ్ చేత తినిపించే ప్రమాదం పొంచి ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు బండి సంజయ్ కు ఇలా ప్రాణహాని తలపెట్టవచ్చని అనుమానాలు ఉన్నాయన్నారు. కాబట్టి జైల్లో సంజయ్ కి ఆహారం ఇచ్చేటప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ల పర్యవేక్షణ వుండేలా ఆదేశించాలని న్యాయమూర్తిని అభ్యర్థించినట్లు మృత్యుంజయం పేర్కొన్నారు.

జాగరణ దీక్ష ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు భగ్నం చేసారని ఆయ‌న ఆరోపించారు. కానీ పోలీసులు న్యాయస్థానం ముందు పచ్చి అబ్బద్దాలు ఆడారన్నారు. తాము ఎంపీ కార్యాలయంలోకి వెళ్లలేదని.. గేటు బయటే వున్నామని పోలీసులు చెబుతున్నారు… మరి లోపలున్న బిజెపి నాయకులకు గాయలెలా అయ్యాయని ప్రశ్నించారు. సంజయ్ బెయిల్ కోసం మరోసారి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మృత్యుంజయం తెలిపారు. సీనియర్ న్యాయవాదుల ద్వారా హైకోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టులో హౌస్ మోషన్ లేదా లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామన్నారు. 333సెక్షన్ తొలగించాలని స్క్వాష్ పిటిషన్ కూడా వేయనున్నట్లు మృత్యుంజయం వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like