బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా

-తన న్యాయవాది చేత బండికి నోటీసులు జారీచేసిన కేటీఆర్
-ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన సంజయ్ ఆరోపణలు
-ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదా బహిరంగ క్షమాపణ చెప్పాల‌ని లీగల్ నోటీసు పంపిన కేటీఆర్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.48 గంటల్లో కేటీఆర్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాది ద్వారా బండిసంజయ్ కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపారు. తన నిర్వాకం వల్లే రాస్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్ధులు మరణించారని బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ట్విట్ట‌ర్ వేదికగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోపు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ తరపు న్యాయవాది బండిసంజయ్ ను కోరారు. లేకపోతే సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారంగా పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో కోరారు.

కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్ధులు మరణించారని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండిసంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు చనిపోతే కేసీఆర్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియోను బండి సంజయ్ పోస్టు చేశారు.

అయితే ఇంటర్ విద్యార్ధుల మృతికి తాను ఎలా కారణమయ్యానో బండిసంజయ్ ఆధారాలు చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈ ఆరోపణలపై చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని కూడా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కోరారు. లేకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like