బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో ఉద్రిక్తత

మంచిర్యాల : బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. ప‌ట్ట‌ణంలో అక్ర‌మ క‌ట్ట‌డాలు తొలగిస్తున్న సంద‌ర్భంలో స్థానికులు అడ్డుకుంటున్నారు. బెల్లంప‌ల్లిలోని 170 స‌ర్వే నంబ‌ర్‌లో కొంద‌రు ఇండ్లు క‌ట్టుకుని నివసిస్తున్నారు. అది పీపీ ల్యాండ్ కావ‌డంతో ఇవి అక్ర‌మ క‌ట్ట‌డాల‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇందులో ఉన్న వ్య‌క్తుల వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని ఇక్క‌డ స్థ‌లం చూపించారు. అధికార పార్టీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు చ‌క్రం తిప్పారు. మున్సిపాలిటీకి చెందిన అధికారులు ఇంటి నెంబ‌ర్లు సైతం కేటాయించారు. విద్యుత్ మీట‌ర్లు కూడా పెట్టారు. ఇప్పుడు అక్ర‌మ క‌ట్ట‌డాలు అని తొల‌గించ‌డం ప‌ట్ల స్థానికులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్క‌డ నిల‌బ‌డి మ‌రీ కూల్చివేత‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like