చెప్పు దెబ్బ‌లు తింటారు జాగ్ర‌త్త

Gandrat Sujata:త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారిపై టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గండ్ర‌త్ సుజాత తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చెప్పు దెబ్బ‌లు తింటార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారంఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం మార్వాడి ధర్మశాల బాలాజీ దేవాల‌యంలో వెంక‌టేశ్వ‌ర స్వామి మీద‌ ప్రమాణం చేసిన ఆమె విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా సుజాత మాట్లాడుతూ తాను డ‌బ్బుల‌కు అమ్ముడుపోయాయ‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్రచారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గండ్ర‌త్ సుజాత ఒక‌రికి అమ్ముడు పోయేది కాదంటూ స్ప‌ష్టం చేశారు. మ‌హిళ‌లు పోటీ చేస్తున్నార‌ని త‌న‌ను ఎదుర్కొనే ద‌మ్ము లేక ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. తన‌ ప్రతిష్ట దిగ‌జారే విధంగా దుష్ప‌చారాలు చేస్తున్నారని, ఈ చిల్ల‌ర మ‌ల్ల‌ర చేష్ట‌ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని చెప్పి కొన్ని మూక‌లు చెడు ప్ర‌చారం చేస్తున్నారని అన్నారు.

జోగు రామ‌న్న అనే వ్య‌క్తి సంపాదించిన డ‌బ్బులు మూట‌ల‌కు మూట‌లు గండ్ర‌త్ సుజాత‌కు ఇచ్చిండ‌ని వాళ్ల‌కు సంబంధించిన కుక్క‌లు మెరుగుతున్నాయని అన్నారు. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బు ఉంటే ప్ర‌జ‌ల‌కు పంచి పెట్టండి కానీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే స‌హించేది లేద‌న్నారు. జోగు రామన్న, బీఆర్ ఎస్ నేతలపై సుజాత ఈ సంద‌ర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచైనా, చెడైనా ప్ర‌జ‌ల వైపు ఉంటాన‌ని అన్నారు. ప్ర‌జ‌లు త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌కోపోయినా ప్ర‌జ‌ల్లో ఉన్నాన‌ని, జనం గొంతుక‌గా అన్యాయాల‌పై ప్ర‌శ్నించాన‌న్నారు. నాకు డ‌బ్బే అవ‌సరం అనుకుంటే నేను సంపాదించిన ప్ర‌తి రూపాయితో సంతోషంగా ఉండేదాన్న‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌ను రాజకీయాల్లో లేకుండా చేయాల‌ని చూస్తున్నారని, మ‌హిళ‌లంటే ఆదిశ‌క్తి అని నిరూపిస్తాన‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ నేర్పిందని సుజాత వెల్ల‌డించారు. మొరిగే ముందు నిరూపించాల‌ని లేక‌పోతే చెప్పుదెబ్బ‌లు తప్ప‌వంటూ మ‌రోమారు విరుచుకుప‌డ్డారు గండ్ర‌త్ సుజాత‌.

Get real time updates directly on you device, subscribe now.

You might also like