భార‌త్‌పై ప్ర‌శంస‌లు.. పాకిస్తాన్‌పై విమ‌ర్శ‌లు

-గోధుమ‌ల విష‌యంలో భార‌త్‌కు ఆఫ్ఘ‌న్ల ధ‌న్య‌వాదాలు
-దాయాది దేశం పాకిస్తాన్‌పై ఆగ్ర‌హం

ఒక సాయం విష‌యంలో భార‌త్‌కు ధ‌న్య‌వాదాలు చెబుతున్న ఆఫ్ఘ‌న్లు, అదే దాయాది దేశ‌మైన పాకిస్థాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు అండ‌గా నిలిచిన భార‌త‌దేశానికి కృత‌జ్ఞ‌త‌లు అంటూనే పాకిస్థాన్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు.

అంత‌ర్గ‌త సంక్షోభంతో ఆఫ్గ‌నిస్తాన్ అల్లాడిపోతోంది. ముఖ్యంగా అక్క‌డ ప్ర‌జ‌లు ముఖ్యంగా పిల్ల‌లు, వృద్దులు ఆక‌లితో అల‌మ‌టించిపోతున్నారు. 20 మిలియన్లకు పైగా ఆఫ్గన్‌ ప్రజలు దాదాపు3 దశాబ్దాలకు పైగా ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నార‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వారికి సాయం అందించాల‌ని మోదీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 50 వేల ట‌న్నుల‌ను గోధుమ‌ల‌ను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మొద‌టి విడ‌త‌గా 2,500 టన్నుల గోధుమలను పాకిస్తాన్ భూ మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు తరలించింది. దీనిపై ఆఫ్గ‌నిస్తాన్‌లో అన్నివ‌ర్గాలు ఆనందం వ్య‌క్తం చేశాయి.

పాకిస్తాన్ బుద్ధి పట్ల తాలిబాన్లు కూడా సంతోషంగా లేరని తెలుస్తోంది. అధిక నాణ్యత గల గోధుమలను సరఫరా చేస్తున్నందుకు భారతదేశాన్ని ప్రశంసించిన తాలిబాన్.. తక్కువ నాణ్యత గల గోధుమలను సహాయంగా అందించిన పాకిస్తాన్ పై తాలిబాన్లు విమర్శలు గుప్పించారు. పాక్ పంపిన గోధుమలు కుళ్లిపోయాయని, తినడానికి పనికి రావని తాలిబాన్ ప్రతినిధి మండిపడ్డారు. పాక్ గోధుమల నాణ్యత తక్కువగా ఉందని ఈ ప్రకటనలు చేసిన తాలిబాన్ అధికారిని అతని పదవి నుండి తొలగించినట్లు సమాచారం. పాక్, భారత్ ఇచ్చిన గోధుమల గురించి తాలిబాన్ ప్రతినిధి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదే స‌మ‌యంలో పాకిస్తాన్ సైతం ప‌క్క దేశ‌మైన ఆఫ్గ‌నిస్తాన్‌కు గోధుమ‌లు పంపిణీ చేసింది. అయితే అవి స‌రిగ్గా లేవ‌ని, నాణ్య‌త త‌క్కువ‌గా ఉండ‌టంతో కొన్ని తిన‌టానికి కూడా ప‌నికిరావ‌ని తక్కువ నాణ్యత గల గోధుమలను సహాయంగా అందించిన పాకిస్తాన్ పై తాలిబాన్లు విమర్శలు గుప్పించారు. పాక్ పంపిన గోధుమలు కుళ్లిపోయాయని, తినడానికి పనికి రావని తాలిబాన్ ప్రతినిధి మండిపడ్డారు. అంత‌ర్జాతీయంగా పేరు కోసం మాత్ర‌మే పాకిస్తాన్ ఈ సాయం చేసింద‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చాలా మంది ఆఫ్ఘన్‌లు భారతదేశం దాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒక ట్విట్టర్ యూజర్.. పక్కనే ఉన్న ముస్లిం దేశానికి, భారత దేశానికి మధ్య తేడాను చూడండి. హే ఇండియా! ఆఫ్ఘన్ ప్రజలకు మీ మద్దతుకు ధన్యవాదాలు. మన మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఎప్పటికీ ఉంటాయి. జై హింద్! అని చెప్పడం విశేషం. మన దేశం నుంచి ఇప్పటికే 5,00,000 డోస్‌ల కోవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్లు,13 టన్నుల మెడిసిన్‌, 500 యూనిట్ల శీతాకాలపు దుస్తులు సరఫరా చేసింది. విడతల వారీగా గోధుమలతోపాటు ఇతర సరుకులను కూడా ఆఫ్గన్‌కు మన దేశం నుంచి పంపిణీ చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెల్పింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like