భార‌త అభివృద్ధికి దార్శ‌నికుడు రాజీవ్‌గాంధీ

భార‌తదేశం అభివృద్ధి చెందుతోంది అంటే గ‌తంలో ప్ర‌ధానిగా రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణ‌యాలే అని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సురేఖ మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలు శ్లాఘ‌నీయ‌మ‌న్నారు. రాజీవ్ గాంధీ దీర్ఘకాలిక ఆలోచనలు, వ్యూహాలతోనే దేశం ముందుడుగు వేసింద‌న్నారు. యువత రాజకీయాల్లోకి రావాల‌ని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘ‌న‌త రాజీవ్‌గాంధీకి ద‌క్కుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ రోజు దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతోంది అంటే రాజీవ్ వల్లనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూములనరేష్, RGPRS జిల్లా అధ్యక్షుడు గడ్డంత్రిమూర్తి, పట్టణ ఉపాధ్యక్షులు జోగులసదానందం, మహిళ జిల్లా అధ్యక్షురాలు పెంటరజిత, పట్టణ అధ్యక్షురాలు గజ్జెలహేమలత, మెనంలక్ష్మి, స్రవంతి,లలిత,పద్మ, కొండచంద్రశేఖర్, బొల్లంభీమయ్య, పెంటరమేష్, వెంకటేష్, ఖదీర్, మోహన్ రెడ్డి, గట్టు స్వామి, తిరుపతి, దాదు, రాజన్న, తజమ్ముల్, లక్ష్మణ్, బుద్దర్ది శంకర్, రాజ్ కుమార్, ఫర్వేజ్, ప్రకాష్, ఇర్ఫాన్, రవీందర్, రమేష్ నాయక్, బోరే శ్రీను, రఫిక్, అంజాద్, వేముల రమేష్, షకీల్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like