భార‌త్‌ను నిర్దేశిందే ద‌మ్మెవ‌రికీ లేదు..

-ఆ దేశ విదేశాంగ విధానం సూప‌ర్‌
-మ‌న‌దేశంపై దాయాది ప్ర‌ధాని మ‌రోసారి ప్ర‌శంస‌లు
-మా దేశ నేతలు గొర్రెల్లా అమ్ముడుపోతున్నారని ఆవేద‌న‌

‘భార‌త్‌ను నిర్దేశించే ద‌మ్మెవ‌రికీ లేదు… ఏ అగ్ర‌రారాజ్యం భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. ఇతరుల కంటే భారత్‌ గురించి నాకే ఎక్కువ తెలుసు. ఏ ‘సూపర్‌ పవర్‌’భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. దానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)భావజాలమే’న‌ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. శుక్ర‌వారం రాత్రి పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న కీల‌క ప్ర‌సంగం చేశారు. ముఖ్యంగా భార‌త‌దేశంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇండియాకు ధమ్కీ ఇచ్చేంతటి దమ్ము ప్రపంచంలో ఏ దేశానికీ లేదని తనను గద్దె దింపేందుకు పాక్ నేతలు అమెరికా డిప్లమాట్ లతో చేతులు కలిపారని ఆయన మరోసారి మండిపడ్డారు.

‘‘నన్ను పదవి నుంచి తొలగించాలంటూ అమెరికా డిప్లమాట్​లు బెదిరింపు లెటర్ రాశారు. వారికి మోకరిల్లే వ్యక్తే ప్రధాని పదవిలో ఉండాలని కుట్ర చేశారు. కానీ.. ఇండియాకు అలాంటి బెదిరింపు పదాలతో లేఖ రాసే దమ్ము మాత్రం ఈ ప్రపంచంలో ఏ దేశానికీ లేదు. మా దేశ నేతలు గొర్రెల్లా అమ్ముడుపోతున్నారు. పాకిస్తాన్​లో ఏర్పడే ఇంపోర్టెడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు దేశ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపాలి” అని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని కోరారు. పాక్ నేతలను అమెరికా డిప్లమాట్ లు కలిసిన తర్వాతే మొత్తం ప్లాన్ బయటకు వచ్చిందన్నారు. 22 కోట్ల మంది పాకిస్తానీలను విదేశీ శక్తులు అవమానిస్తున్నాయని మండిపడ్డారు.

పాకిస్థాన్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. తన ప్రభుత్వ పతనాన్ని మీడియా సెలబ్రేట్ చేస్కుంటోందంటూ విమర్శించారు. సుప్రీంకోర్టు (Supreme court) ఇచ్చిన తీర్పు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. తనపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి (Khasim Suri) తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఇచ్చిన తీర్పు తనను బాధించిందనీ.. కానీ ఆ తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. పాకిస్థాన్‌లో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, బనానా రిపబ్లిక్‌ ఉన్నచోటా ఇలా బహిరంగంగా జరగదని వ్యాఖ్యానించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like