‘భీమ్లా నాయ‌క్’ వెన‌క‌డుగు..

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయ‌క్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంది. ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుందంటూ కొన్ని రోజుల నుంచి నెట్టింట వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్త‌లే నిజ‌మ‌య్యాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఎట్ట‌కేల‌కు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయ‌క్’ వ‌చ్చే ఏడాది సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంది. ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుందంటూ కొన్ని రోజుల నుంచి నెట్టింట వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్త‌లే నిజ‌మ‌య్యాయి. భీమ్లా నాయ‌క్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంద‌నే విష‌యాన్ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ త‌ర‌పున దిల్ రాజు తెలిపారు. ఈ సంద‌ర్భంలో దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘పాండమిక్ త‌ర్వాత ఇప్పుడు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నాయి. వ‌రుస సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆర్ఆర్ఆర్‌, భీమ్లా నాయ‌క్‌, రాధే శ్యామ్ సినిమాల‌ను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆ ప్ర‌కార‌మే అనౌన్స్‌మెంట్స్ కూడా చేశాం.

అయితే ఆర్ఆర్ఆర్‌, రాధేశ్యామ్ సినిమాలు స్టార్ట్ చేసి మూడేళ్లు అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కూడా. జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్‌ రిలీజ్ అవుతుంటే జ‌న‌వ‌రి 14న రాధే శ్యామ్ విడుద‌ల‌వుతుంది. ఈ క్ర‌మంలో భీమ్లా నాయ‌క్ మూవీ నిర్మాతలను, హీరోగారిని మా గిల్డ్ తరపున దానయ్యగారు, యువీ వంశీగారు కలిశారు. వారు సినిమాను మరో డేట్‌కు రిలీజ్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మ‌న తెలుగు సినిమాల‌కు ప్ర‌పంచం వ్యాప్తంగా చాలా మంచి గుర్తింపు వ‌స్తుంది. దాన్ని మ‌నం ఇంకా ముందుకు తీసుకెళ్లాల‌ని ఉద్దేశం… మూడు పెద్ద సినిమాలు విడుద‌లైతే తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్స్‌ను విభ‌జించే పరిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. భీమ్లా నాయ‌క్ హీరో, నిర్మాత‌ల‌కు మా గిల్డ్ ద్వారా థాంక్స్ చెబుతున్నాం. ఫిబ్ర‌వ‌రి 25, శివ‌రాత్రి రోజున భీమ్లా నాయ‌క్‌ను రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాం’’ అన్నారు.

సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయ‌క్ త‌ప్పుకోవ‌డంపై ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశ‌కు గుర‌వుతున్నారు. కానీ ప‌రిస్థితుల ప్ర‌కారం భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు రీమేక్‌గా రూపొందిన భీమ్లా నాయ‌క్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, మాట‌లు అందించ‌డంతో పాటు ఓ పాట కూడా రాశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like