భూమి పూజ‌లు.. కొత్త ప‌థ‌కాలు

-చెన్నూరు లిఫ్ట్ ఇరిగేష‌న్ తో స‌హా ప‌లు ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు
-రెండు కొత్త ప‌థ‌కాలు ప్రారంభం, మ‌రో ప‌థ‌కం రెండో విడ‌త సాయం
-మంచిర్యాల జిల్లాలో నేడు ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న

CM KCR:ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంచిర్యాల ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా పెద్ద ఎత్తున భూమి పూజ‌లు చేయ‌నున్నారు. అదే స‌మ‌యంలో కొత్త ప‌థ‌కాల‌ను సైతం ప్రారంభించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ముఖ్య‌మంత్రి చెన్నూరు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కానికి భూమి పూజ చేస్తారు. రూ. 1,748 కోట్ల‌తో చెన్నూరు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కం ప్రారంభించ‌నుండ‌గా, ల‌క్ష ఎక‌రాల‌కు నీరందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌డ్త‌న‌ప‌ల్లి లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కానికి కూడా ఆయ‌న భూమి పూజ చేస్తారు. రూ. 90 కోట్ల‌తో నిర్మించనున్న ఈ ప‌థ‌కం 10 వేల ఎక‌రాల‌కు నీరిందించనుంది. మంద‌మ‌ర్రి స‌మీపంలో రూ. 500 కోట్ల‌తో పామాయిల్ ఇండ‌స్ట్రీకి సైతం కేసీఆర్ భూమి పూజ నిర్వ‌హిస్తారు. ఇక మంచిర్యాల చిర‌కాల కోరిక అయిన మంచిర్యాల అంత‌ర్గాం హైలెవ‌ల్ బ్రిడ్జీ ప‌నుల‌ను సైతం ఆయ‌న ప్రారంభిస్తారు. రూ. 165 కోట్ల‌తో నిర్మించనున్న ఈ బ్రిడ్జీ పూర్త‌యితే మంచిర్యాల నుంచి హైద‌రాబాద్ మ‌ధ్య దూరం త‌గ్గ‌డం కాకుండా, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు స‌మ‌యం, డ‌బ్బు ఆదా కానున్నాయి. గుడిపేట‌లో రూ. 510 కోట్ల‌తో నిర్మించ‌నున్న మెడిక‌ల్ క‌ళాశాల భ‌వ‌నానికి సైతం భూమి చేస్తారు సీఎం.

ప‌థ‌కాల‌కు ప్రారంభాలు..
ఇక్క‌డే కొత్త ప‌థ‌కం ఒక‌టి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ళిత‌బంధు ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం బీసీల‌కు సైతం ల‌క్ష రూపాయ‌లు ఆర్థిక సాయం అందించేటా ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. దీనిలో భాగంగా ఇక్క‌డే నుంచే ఈ ప‌థ‌కం ప్రారంభిస్తారు. ఇక గొల్ల‌, కుర్మ‌ల‌కు రెండో విడ‌త గొర్రెల పంపిణీ కూడా మంచిర్యాల నుంచే ప్రారంభించ‌నున్నారు. గృహ‌ల‌క్ష్మి

Get real time updates directly on you device, subscribe now.

You might also like