బీజేపీ పోరాటంతోనే మంచిర్యాల కు మెడికల్ కాలేజీ

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర‌బెల్లి రఘునాథ్

మంచిర్యాల : బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే జిల్లా లో మంత్రుల పర్యటన సందర్భంగా త‌మ కార్యకర్తలను అక్రమంగా అరెస్టుల చేస్తున్నారని ఎర‌బెల్లి ర‌ఘునాథ్ అన్నారు. మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో శ‌నివారం మంచిర్యాల అసెంబ్లీ, జన్నారం మండలం శక్తి కేంద్ర ఇన్‌ఛార్జిల సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల కు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల బీజేపీ నాయకుల పోరాట ఫలితంగానే వ‌చ్చింద‌న్నారు. శుక్ర‌వారం మంత్రి హరీష్ రావు ప్రారంభించిన పనులు అక్కడికే పరిమితం కాకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు భార‌తీయ జ‌న‌తా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేస్తున్నామన్నారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయి లో బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, పొనుగోటి రంగారావు, ముల్కళ్ల మల్లారెడ్డి, పెద్దపల్లి పురుషోత్తం, మున్నరాజా సిసోడియా, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మండల అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బొలిశెట్టి తిరుపతి, వీరమళ్ళ హరిగోపాల్, గొపతి రాజన్న, గోలి చందు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like