బీజేవైఎం నేత కాలి పై నుంచి పోలీసు వాహ‌నం

పోలీసులు బీజేవైఎం నేత కాలిపై నుంచి వాహనం తీసుకువెళ్ల‌డంతో ఆయ‌న కాలికి తీవ్ర గాయాల‌య్యాయి. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు శ‌నివారం రాత్రి నుంచి ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. వారిని ప‌రామ‌ర్శించేందుకు, విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఎంపీ సోయం బాపురావు అక్క‌డికి బ‌య‌ల్దేరారు. ఆయ‌నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లు పోలీసుల‌కు అడ్డుకున్నారు. అటు బీజేపీ నేతలు, ఇటు పోలీసుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బిజెవైఎం రాష్ట్ర స్టడీ సర్కిల్ కన్వీనర్ కుమ్మరి వెంకటేష్ పై పోలీసుల దౌర్జన్యంగా ప్ర‌వ‌ర్తించారు. వెంకటేష్ కాలు పై నుంచి పోలీసులు తమ వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయ‌న కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like