బీఎంఎస్ ఒత్తిడితోనే జేబీసీసీఐ స‌మావేశం

- స్టాండింగ్ కమిటీ స‌మావేశం బహిష్కరిస్తామంటే కోలిండియా దిగివ‌చ్చింది
- బీఎంఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జేబీసీసీఐ స‌భ్యుడు మాధ‌వ‌నాయ‌క్

మంచిర్యాల : భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ ఒత్తిడి వ‌ల్ల‌నే కోలిండియాలో జేబీసీసీఐ స‌మావేశం నిర్వ‌హిస్తున్నార‌ని బీఎంఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జేబీసీసీఐ స‌భ్యుడు మాధ‌వ‌నాయ‌క్ స్ప‌ష్టం చేశారు. గురువారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ కార్పొరేట్, కొత్తగూడెం ఏరియాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. బీఎంఎస్ భవన్ లో నిర్వ‌హించిన ఈ సమావేశంలో పి. మాధవ నాయక్ మాట్లాడుతూ కోలిండియా యజమాన్యం కోవిడ్ పేరుతో జేబిసిసిఐ సమావేశం నిర్వహించకుండా కాలయాపన చేసింద‌న్నారు. ఈ నెల 16న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఆధ్వ‌ర్యంలో నిర్వహించే స్టాండింగ్ కమిటీ సమావేశం బ‌హిష్క‌రిస్తామ‌ని బీఎంఎస్ హెచ్చ‌రించింద‌న్నారు. దీంతో కోలిండియా యజమాన్యం దిగివచ్చి అదే రోజు సాయంత్రం 3 గంటల నుంచి జేబిసిసిఐ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంద‌న్నారు. అయితే మూడో దఫా నిర్వ‌హించే ఈ జేబిసిసిఐ సమావేశంలో చ‌ర్చ‌లు ఫ‌లప్రదం కావాలంటే వరసగా రెండురోజు పాటు నిర్వహించాలని భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తోంద‌న్నారు. ఈ సమావేశంలో యూనియస్ కేంద్ర కమిటీ నాయకులు ఎం. ప్రభాకర్ రావు, నరేంద్ర బాబు,ఎం.శ్రీనివాస్, సంగం చందర్, మూర్తి, కార్పొరేట్ ఏరియా నాయకులు జీవీ. కృష్ణారెడ్డి, ఉట్ల గణేశ్, రాంసింగ్, బాలకృష్ణ, సంపత్ రావు, కొత్తగూడెం ఏరియా కమిటీ నాయకులు మొగిలిపాక రవి, టి.వి. పవన్ కుమార్, భీమా,ఎస్‌. రామచందర్ రావు, యాకూబ్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like