మెరుగైన వేతన ఒప్పందం కోసం బీఎంఎస్ కృషి

సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్య‌క్షుడు యాద‌గిరి స‌త్త‌య్య‌

BMS push for better wage deal in coalmines: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు జేబీసీసీఐలో మెరుగైన వేతన ఒప్పందం కోసం బీఎంఎస్ తీవ్రంగా కృషి చేస్తుందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్య‌క్షుడు యాద‌గిరి స‌త్త‌య్య వెల్ల‌డించారు. ఆర్జీ 1 ఏరియా ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ వారం రోజుల కింద‌ట‌ అఖిల భారతీయ కధాన్ మజ్దూర్ సంఘ్ (ABKMS-BMS)104వ కార్యవర్గ సమావేశం నిర్వ‌హించార‌ని అందులో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. బీఎంఎస్ మెరుగైన వేతన ఒప్పందం చేసేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్న‌దని వెల్ల‌డించారు. కోల్ ఇండియా యాజమాన్యం కూడా చిత్త శుద్ధితో ముందుకు రాకపోతే కార్మికులు కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులకు 10 వేల రూపాయలకు తగ్గకుండా బోనస్ చెల్లించాలని స‌మావేశంలో తీర్మానం చేసిన‌ట్లు తెలిపారు. అంతేకాకుండా, సెలవులు, CMPF, గ్రాట్యుటీ తదితర సదుపాయాల‌తో పాటు కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కలగజేయలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేసిన‌ట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఎంఎస్ ఆధ్వ‌ర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వ‌ర్యంలో జాతీయ స్థాయిలో 28న‌ BMS పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం BMS అధ్వర్యంలో 17నవంబర్ 2022న న్యూ ఢిల్లీలో భారీ ఎత్తున ధర్నా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆకుల హరిణ్, సాయవేణి సతీష్, వడ్డేపల్లి కుమారస్వామి, పెండెం సత్యనారాయణ, అరుకాల ప్రసాద్, మామిడి స్వామి, పల్లె శ్రీనివాస్, సిరిపురం నరసయ్య, తాట్ల లక్ష్మయ్య, పోతరాజు భాస్కర్, వై. కోటయ్య, బోడకుంట రాజేశం, రాపోలు వజ్ర వేణు, సంఘాని సాంబయ్య, నీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like