బొగ్గు బ్లాకుల వేలం పై కేంద్ర మంత్రి సానుకూల స్పందన

నాలుగు బొగ్గు బ్లాక్ లను సింగరేణి కాలరీస్ కేటాయించాలని అభ్యర్ధన - బిఎంఎస్ జాతీయ నాయకులు కె. లక్ష్మారెడ్డి - సానుకులంగా స్పందించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం ప్రతిపాదన జాబితా నుండి తొలగించి వాటిని సింగరేణికి కేటాయించాలని బిఎంఎస్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మా రెడ్డి కోరారు. ఆయన అధ్వర్యంలో పార్లమెంటరీ వ్యవరాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసారు

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మంత్రితో పలు విషయాలపై చర్చించారు.దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకుల లో నాలుగు సింగరేణికి సంభందించినవి ఉన్నాయన్నారు. కోయగూడెం బ్లాక్ – III సత్తుపల్లి బ్లాక్ -III, శ్రవాణపల్లి. కళ్యాణి ఖని బ్లాక్ – 6. వేలానికి సిద్ధం చేసిన విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించినట్లయితే అపారమైన అనుభవం, భౌగోళిక పరిస్థితుల గురించి తెలిసిన సింగరేణి సురక్షితంగా సమర్థవంతంగా బొగ్గు ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. . సింగరేణి కాకుండా ఇతరులకు వాటిని కేటాయించినట్లయితే బొగ్గు నష్టం, విలువైన వనరులను నష్టం పోవాల్సి ఉంటుందన్నారు. ఈ బొగ్గు బ్లాకులకు సంబంధించి సింగరేణి సర్వే కూడా చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. CMPDIL కూడా కూడా సింగరేణికి కేటాయించాలని సిఫార్సు చేసిందన్నారు. ఈ గనులు సింగరేణి చేపట్టితే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని తెలిపారు.

రెండున్నర దశాబ్దాల క్రితం సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి మంచి ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. ఆ ప్యాకేజీ అందిపుచ్చుకున్న సింగరేణి కార్మికులు ఎంతో క్రమశిక్షణ పట్టుదలతో కష్టపడి పనిచేసి 1200 కోట్ల ఆర్థిక నష్టాన్ని పూరించి 2002-03 ఆర్థిక సంవత్సరంలో లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనచరిత్ర సింగరేణి కార్మికులకు ఉందని తెలిపారు. ఈ కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మా రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో పులి రాజా రెడ్డి, ABKMS వర్కింగ్ కమిటీ సభ్యులు రమాకాంత్ BMS రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ యూనియన్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి పి. మాధవ నాయక్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like