బాయ్‌కాట్ హ్యుందాయ్‌..

-పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తుగా హ్యుంద‌య్ ట్వీట్‌
-సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు
-దక్షిణ కొరియా అధికారులకు భారత్ సమన్లు

కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌కు మద్దతుగా మోటారు కార్ల సంస్థ హ్యుందయ్ చేసిన ట్వీట్‌తో చాలా మంది భార‌తీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 5 న పాకిస్థాన్ జరుపుకునే కశ్మీర్ సంఘీబావ దినోత్సవం సందర్శంగా హ్యుందయ్ పాకిస్థాన్ కు అనుకూలంగా పోస్ట్‌ చేసింది. మరోవైపు, హ్యుందాయ్ కంపెనీ తక్షణమే భారత్‌కు క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు, పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. #BoycottHyundai అంటూ ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు. సియోల్‌లోని భారత రాయబారి హ్యుందయ్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి వివరణ కోరగా.. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసినట్టు తెలిపింది. ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా రాయబారికి సమన్లు జారీ చేసినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని భారత్ స్పష్టం చేసింది.

కశ్మీర్‌కు సంబంధించి ఫిబ్రవరి 5న హ్యుందయ్ పాకిస్థాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌‌పై వెంటనే వివరణ ఇవ్వాలని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్‌‌ను కోరింది. అంతేకాదు, ఈ విషయంపై ఆ సంస్థ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఉద్ఘాటించారు.

మరోవైపు, సియోల్‌లోని భారత రాయబారి శ్రీప్రియ రంగనాథన్ కూడా హ్యుందయ్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ వివాదాస్పద పోస్టుపై హ్యుందయ్ మోటార్స్ స్పందిస్తూ.. పాకిస్థానీ భాగస్వామి చేసిన అనధికారిక ట్వీట్ పట్ల విచారం వ్యక్తం చేసింది.. ఆక్షేపణీయమైన ఆ పోస్ట్‌ను కూడా తొలగించామని తెలిపింది. భారతీయ వినియోగదారుల విషయంలో నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like