ఆల్ఇండియా పోటీల్లో కానిస్టేబుల్‌కు కాంస్య ప‌త‌కం

ఉదయ్ కిరణ్ ని అభినందించిన రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి

Bronze Medal for Constable in All India Competitions: న్యూఢిల్లీలో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడవ ఆల్ ఇండియా జూడో క్లస్టర్ జిమ్నాస్టిక్ పోటీల్లో రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్ కానిస్టేబుల్ అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఉదయ్ కిరణ్ ఈ పోటీల్లో కాంస్య ప‌త‌కం సాధించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ఈ పోటీలు కొన‌సాగాయి. ఈ సంరద‌ర్బంగా శ‌నివారం రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి కానిస్టేబుల్ ఉద‌య్ కిర‌ణ్‌ను అభినందించారు. ఆటలు కేవలం దేహ దారుఢ్యానికే కాకుండా, ఆరోగ్యం, మానసికోల్లాసానికి కూడా దోహదపడతాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తూ, పోలీసుల క్రీడాకారుల‌కు ఎల్లవేళ‌లా అండ‌గా ఉంటామ‌ని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్ సిఐ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like