కారు మీద ప్రెస్ స్టిక్కర్.. లోప‌ల చూస్తే షాక్‌..

పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. ఇంత‌లో ఓ కారు వ‌చ్చి ఆగింది. దానిపై ప్రెస్ అనే స్టిక‌ర్ ఉంది. దానిని పంపిద్దామ‌నుకున్న పోలీసులు అనుమానం వ‌చ్చి డోర్ తీసి అవాక్క‌య్యారు.

ఆంధ్ర‌ప్రేదేశ్‌లో ఏపీలో మద్యపానంపై ఆంక్షలు ఉండటంతో.. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. పోలీసులు నిఘా వేసి.. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్నారు. దీంతో లిక్కర్ మాఫియా తెలివి మీరింది. పోలీసుల కళ్లు గప్పేందుకు కొత్త, కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో కూడా మీడియా ముసుగులో మద్యం బాటిళ్లు తరలిస్తూ అధికారులకు దొరికిపోయారు.

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలిస్తున్నారని గుంటూరు జిల్లా అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే ఏనుగుపాలెం- చినకంచర్ల రోడ్డులో నిఘా పెట్టారు. ఈలోపు అటువైపుగా ఓ కారు వచ్చింది.. అద్దాలపై ప్రెస్ స్టిక్కర్ ఉంది. అనుమానంతో కారును ఆపి తనిఖీ చేశారు.. డోర్ తీయగానే లోపల మద్యం బాటిళ్లు చూసి అవాక్కయ్యారు. ఎవరికీ అనుమానం రాకుండా ముందు, వెనుక రెండు పక్కలా వాహనానికి ప్రెస్‌ స్టిక్కర్లు అంటించారు.

తెలంగాణ నుంచి ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాంది రూ.180 ఎం.ఎల్‌. సీసాలు 912 పది పెట్టెల్లో పెట్టుకుని తీసుకొస్తున్నారు. ఈ కేసులో గురజాల మండలం పల్లెగుంతకు చెందిన షేక్‌ సిద్దావలిని ప్రధాన ముద్దాయిగా తేల్చారు. రెంటచింతలకు చెందిన మనోహర్‌, పుల్లలచెరువుకు చెందిన ఆంజనేయులు గురజాలలోని ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. వీరు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మద్యం బాటిళ్లు తీసుకొస్తున్నారు. కారులో ఉన్న మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దర్ని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like