బీఆర్ఎస్ యువ‌నేత‌పై కేసు నమోదు

మంచిర్యాల జిల్లాలో ఓ బీఆర్ఎస్ యువ‌నేత‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. బెల్లంప‌ల్లిలో గురువారం రాత్రి బీఆర్ఎస్, బీఎస్పీ నేత‌ల మ‌ధ్య ఫ్లెక్సీల విష‌యంలో ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. బీఎస్పీ నేత‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండ‌గా ప‌ట్ట‌ణ యువ‌జ‌న అధ్య‌క్షుడు స‌న్నీబాబు మ‌రికొంద‌రు వ‌చ్చి బీఎస్పీ బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి వ‌ర‌ప్ర‌సాద్‌పై దాడి చేశారు. త‌న‌పై స‌న్నీబాబు దాడి చేశాడ‌ని వ‌ర ప్రసాద్ బెల్లంప‌ల్లి పోలీస్‌స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

గురువారం రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను బీఎస్పీ పార్టీ అధినేత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఖండించారు. బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య రౌడీగ్యాంగ్ వ‌ర‌ప్రసాద్ అత‌ని స్నేహితుడ‌పై హ‌త్యాయ‌త్నం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. పోలీసులు కేసు పెట్టే విష‌యంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించార‌ని అన్నారు. కేసీఆర్ గారూ ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని ప్ర‌శ్నించారు. మీ అచార‌క పాల‌న‌కు అంత‌మెప్పుడు…? ఈ గూండా గ్యాంగులు, గంజాయి మాఫియాల‌కు అంత‌మెప్పుడు….? అని ట్విట్ట‌ర్ వేదిక‌గా నిల‌దీశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like