సీబీఐ విచార‌ణ చేయాలి

-కార్మికుల సీఎంపీఎఫ్ డబ్బులు తిరిగి చెల్లించాలి
-ఈనెల 24న సీఎంపీఎఫ్ కార్యాల‌యాల ఎదుట ధ‌ర్నాలు
-కాంట్రాక్టీక‌ర‌ణ క‌ప్పిపుచ్చుకునేందుకే స‌మ్మెనాట‌కం
-బీఎంఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వీరమనేని రవీందర్ రావు

కార్మికుల సిఎంపీఎఫ్ డబ్బులు తిరిగి చెల్లించాలని, సిఎంపీఎఫ్ కుంభకోణం పైన సీబీఐ విచారణ చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, బీఎంఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వీరమనేని రవీందర్ రావు స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం మ‌ణుగూరు ఏరియా వర్క్షాపు లో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయ‌న మాట్లాడారు. సీఎంపీఎఫ్ ట్రస్టు డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1300 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చార‌ని తెలిపారు. DHFL కంపెనీ దివాలా తీయ‌డంతో ఆ కంపెనీ బాకీ ఉన్న 727 కోట్ల 56 లక్షల రూపాయలను CMPF ట్రస్టు బోర్డు మాఫీ చేయడం దారుణ‌మ‌న్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించి ఆ కంపెనీ బాకీ ఉన్న మొత్తం డబ్బుని వావ‌స్ తీసుకోవాల‌న్నారు. వారి ఆస్తులు అమ్మి అయినా ఈ డ‌బ్బు కట్టించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సీఎంపీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఎంఎస్ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 24న అన్ని సీఎంపీఎఫ్ కార్యాల‌యాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామ‌న్నారు. ఈ నెల 28,29 న కొన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెకు BMS దూరమన్నారు. సింగ‌రేణిలో కాంట్రాక్టీక‌ర‌ణ క‌ప్పి పుచ్చుకునేందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ్మె నాట‌కం ఆడుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వ తొత్తు సంఘం కూడా స‌మ్మె చేయ‌డం దొంగే దొంగ దొంగ అన్న‌ట్లు ఉంద‌ని ఎద్దేవా చేశారు. బ్రాంచి ఉపాధ్య‌క్షుడు భూక్య కిష‌న్‌, కేంద్ర కార్యదర్శి టీపీవీశివరావు, రామక్రిష్ణ,ఎస్ఎల్ఎన్‌.మూర్తి,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like