ప‌లు రాష్ట్రాలకు కొత్త గ‌వ‌ర్నర్లు

Center appointed new governors: దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‎గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ను నియమించారు. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్‌ తలాఖ్‌ కేసులు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏపీకి గవర్నర్ గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో నజీర్ ను నియమించారు. ఇక ఏపీ గవర్నర్ గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్ ను ఛతీస్‎ఘడ్ రాష్ట్ర గవర్నర్‎గా బదిలీ చేశారు.

ప‌లు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వీరే..
అరుణాచల్‌ ప్రదేశ్‌ – లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్య
సిక్కిం – లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య
లడఖ్ – బి.డి. మిశ్రా
అరుణాచల్‌ ప్రదేశ్‌- త్రివిక్రమ్‌ పర్నాయక్‌
జార్కండ్ – రాధాకృష్ణన్‌
అస్సాం – గులాబ్‌ చంద్‌ కటారియా
హిమాచల్‌ ప్రదేశ్‌- శివప్రసాద్‌ శుక్లా
మణిపూర్ – అనసూయ
నాగాలాండ్ – గణేషన్‌
మేఘాలయ – చౌహాన్‌

Get real time updates directly on you device, subscribe now.

You might also like