చదువుతో పాటు ఆటలు కూడా అవసరం

మంచిర్యాల ఏసిపి అఖిల్ మహాజన్

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. మంచిర్యాల హైటెక్ సిటీలోని మంచిర్యాల క్లబ్లో నిర్వహించిన పోటీలకు ముఖ్యఅతిథిగా మంచిర్యాల ఏసిపి అఖిల్ మహాజన్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు, ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు అవసరమని తెలిపారు, నేటి జిల్లాస్థాయి క్రీడాకారులు పట్టుదలతో ప్రయత్నిస్తే రేపటి అంతర్జాతీయ క్రీడాకారులు ఎదుగుతారన్నారు, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో ఏసిపి అఖిల్ మహాజన్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, జిల్లా క్రీడా అధికారి శ్రీకాంత్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, క్యాతంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, ఒలంపిక్ సంఘం కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలో క్రీడాకారులు 150 మంది వరకు హాజరుకాగా 6, 7 తేదీలలో పోటీలను నిర్వహిస్తున్నట్లు బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి సుధాకర్ తెలిపారు, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ట్రెజరర్ సత్యపాల్రెడ్డి, ఉపాధ్యక్షులు వాసు,కిషన్,సీనియర్ క్రీడాకారులు రాజలింగం,కృష్ణ,లక్ష్మీనారాయణ,హర్ష, ఓదెలు, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమేష్, శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.

మెడిలైఫ్ ఆసుపత్రి యాజమాన్యానికి డాక్టర్ కుమారస్వామి, టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like